Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్ : సెప్టెంబర్ నుంచి 12-18 యేళ్ల వారికీ టీకా...

సెప్టెంబర్ నుంచి 12 నుంచి 18 ఏళ్ల వారికి పంపిణీ ప్రారంభించనున్నట్లు వ్యాక్సిన్ లపై జాతీయ నిపుణుల కమిటీ చీఫ్ డాక్టర్ తెలిపారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. 

COVID-19 vaccination for 12-18 yr children from September - bsb
Author
Hyderabad, First Published Jul 9, 2021, 10:48 AM IST

దేశంలో కరోనా మహమ్మారి మూడోదశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ను మరింత విస్తరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. పెద్దలతో పాటు చిన్నారులకు కూడా వైరస్ నుంచి రక్షణ కల్పించేలా ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరి కొద్ది నెలల్లో 18 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సెప్టెంబర్ నుంచి 12 నుంచి 18 ఏళ్ల వారికి పంపిణీ ప్రారంభించనున్నట్లు వ్యాక్సిన్ లపై జాతీయ నిపుణుల కమిటీ చీఫ్ డాక్టర్ తెలిపారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ఆ తర్వాత కొవాగ్జిన్ టీకా కూడా పిల్లలకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

‘12 నుంచి 18 ఏళ్ల వారికి జైడస్ టీకా ప్రయోగాల ఫలితాలు త్వరలో రానున్నాయి.  మరికొద్ది వారాల్లో ఈ టీకా అత్యవసర వినియోగ అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయి.  సెప్టెంబర్ చివరి నాటికి ఈ వ్యాక్సిన్ చిన్నారులకు అందుబాటులోకి రావచ్చు. పిల్లలపై మూడోదశ క్లినికల్ ప్రయోగాలు మొదలయ్యాయి. అవి సెప్టెంబర్ నాటికి పూర్తి కానున్నాయి. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో లేదా వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నాటికి రెండు నుంచి 18 ఏళ్ల వారికి కూడా అందుబాటులోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి’ అని చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కోవిడ్ మూడో దశ ముప్పు నేపథ్యంలో చిన్నారులకు టీకాలు ఇచ్చే అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. అంతేగాక, పాఠశాలల పున ప్రారంభం చాలా ముఖ్యమైన విషయమని, దీనిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇప్పటివరకు కరోనా వైరస్ రెండు దశల్లో చిన్నరులపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంది. అయినప్పటికీ ముందు జాగ్రత్తల దృష్ట్యా విద్యాసంస్థలను ప్రభుత్వాలు తెరవడం లేదు. మరోవైపు పిల్లలపై పలు సంస్థల టీకాల ప్రయోగాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios