హర్యానాలోని రోహ్ తక్  జిల్లాలో దారుణం జరిగింది. వివాహం చేసుకోవాలనుకున్న ఓ యువజంటను నడిరోడ్డుమీద పట్టపగలు కాల్చి చంపారు. బుధవారం జరిగిన ఈ ఘటనను పరువు హత్యలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ జంటలో అబ్బాయి వయసు 25 యేళ్లు కాగా అమ్మాయి వయసు 27 సంవత్సరాలు. వీరిద్దరి కోర్టు మ్యారేజ్ కి సంబంధించి కొన్ని వివరాలు పూర్తి చేయాల్సి ఉంది. దీనికోసం అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయిని కలవాల్సి ఉంది. ఈ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు వీరితో లేరని డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ సజ్జన్ సింగ్ తెలిపారు.

మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉన్న ఒక ప్రదేశంలో ఈ జంట తల్లిదండ్రులతో కలవాల్సి ఉంది. అక్కడే వీరిమీద దాడి జరిగింది. ఈ దాడిలో అబ్బాయితో పాటు అతని సోదరుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడని డిఎస్పీ తెలిపారు.

"హత్యానేరం కింద కేసు నమోదు చేయబడింది. దీంతోపాటు అమ్మాయి కుటుంబంలోని వారిమీద హత్యతో పాటు చట్టంలోని మరికొన్ని సెక్షన్ ల ప్రకారం కేసు నమోదు చేశామని అని అధికారులు తెలిపారు, దర్యాప్తు కొనసాగుతోంది.