Asianet News TeluguAsianet News Telugu

యూపీ: కారు కొనేందుకు.. పురిటి బిడ్డ విక్రయం, స్వయంగా కన్నతల్లిదండ్రులే

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే కన్నబిడ్డలకు మాత్రం ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలనుకుంటారు తల్లిదండ్రులు. తాము పస్తులు వుండైనా సరే బిడ్డల ఆకలి తీర్చే వారు ఎందరో. కానీ కారు కొనాలనే ఆశతో ఏకంగా పురిట్లోని బిడ్డనే అమ్మకానికి పెట్టారు ఓ కసాయి తల్లిదండ్రులు. 

couple sells newborn for rs 1 lakh to buy a car ksp
Author
Kanpur, First Published May 14, 2021, 4:35 PM IST

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే కన్నబిడ్డలకు మాత్రం ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలనుకుంటారు తల్లిదండ్రులు. తాము పస్తులు వుండైనా సరే బిడ్డల ఆకలి తీర్చే వారు ఎందరో. కానీ కారు కొనాలనే ఆశతో ఏకంగా పురిట్లోని బిడ్డనే అమ్మకానికి పెట్టారు ఓ కసాయి తల్లిదండ్రులు. 

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ జిల్లా తిర్వా కొట్వాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సతౌర్‌కి చెందిన ఓ మహిళ మూడు నెలల క్రితం మగ శిశువుకి జన్మనిచ్చింది. అయితే, వీరికి కారు కొనాలని ఆశ. అయితే అందుకు తగిన ఆర్ధిక స్తోమత వారి వద్ద లేదు.

దీంతో గురుసాహైగంజ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను కలిసి బిడ్డను రూ.1.5 లక్షలకు విక్రయించారు. ఆ పసికందు అమ్మమ్మ, తాతయ్య గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

బిడ్డ ఇప్పటికీ వ్యాపారి వద్దే ఉన్నాడని పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువును అమ్మకానికి పెట్టిన ఆ దంపతులను విచారణ కోసం పిలిచారు. తాము వ్యాపారి ఇచ్చిన డబ్బుతో ఇటీవలే పాత కారును కొనుగోలు చేశామని దంపతులు అంగీకరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios