Asianet News TeluguAsianet News Telugu

కారులోనే పిల్లాడు.. ఫ్లైటెక్కిన తల్లిదండ్రులు: ఇంటికొచ్చి చూసుకుంటే..!!

టాక్సీలు, ఆటోలు, బస్సులు, రైళ్లలో ప్రయాణించినప్పుడు కంగారులో తాళాలు, మొబైల్ ఫోన్లు, బ్యాగులు లేదంటే మరేదైనా వస్తువుల్ని మరచిపోతాం. ఇంటికొచ్చాక చూసుకుంటే ఆ వస్తువులు కనిపించకపపోయే సరికి కంగారుపడతాం.

Couple leaves kid in taxi on way home from Kolkata airport ksp
Author
Kolkata, First Published Oct 29, 2020, 5:00 PM IST

టాక్సీలు, ఆటోలు, బస్సులు, రైళ్లలో ప్రయాణించినప్పుడు కంగారులో తాళాలు, మొబైల్ ఫోన్లు, బ్యాగులు లేదంటే మరేదైనా వస్తువుల్ని మరచిపోతాం. ఇంటికొచ్చాక చూసుకుంటే ఆ వస్తువులు కనిపించకపపోయే సరికి కంగారుపడతాం.

వీలైతే వాటిని ఎలా తిరిగి తెచ్చుకోవాలో ప్రయత్నిస్తాం. అంతేకాని మనతో వచ్చిన మనుషుల్ని మరిచిపోతామా..? కానీ కన్నకొడుకుని తల్లిదండ్రులిద్దరూ మరిచిపోయిన ఘటన కోల్‌కతాలో జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే.. లక్నో చేరుకోవడానికి ఓ కుటుంబం మంగళవారం సాయంత్రం కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. కారులో నుంచి లగేజీ దించటం, విమానం బయలుదేరే సమయం దగ్గరపడటంతో వారు కంగారు పడ్డారు.

ఈ సమయంలో కారులోనే నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని మరిచిపోయారు తల్లిదండ్రులు. లగేజీతో పాటు విమానంలో లక్నోకి వెళ్లిపోయారు. తీరా ఇంటికి వచ్చాక కొడుకు ఏమయ్యాడోనని ఆరా తీయగా టాక్సీ వెనుక సీటులో అలాగే వదిలేసి వచ్చినట్లు గుర్తొచ్చింది.  

దీనిని నుంచి వెంటనే తేరుకుని జరగాల్సిన దానిపై దృష్టి పెట్టిన వారిద్దరూ టాక్సీ బిల్లుపై ఉన్న ఫోన్‌ నెంబరు ఆధారంగా కోల్‌కతాలోని ట్రాఫిక్‌ పోలీసులను సంప్రదించారు. తమ కొడుకుని టాక్సీలో మర్చిపోయి ఇంటికి వచ్చినట్లు చెప్పిన తల్లిదండ్రులు చిన్నారిని కాపాడాలని ప్రాధేయపడ్డారు.

దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసులు విమానాశ్రయ అధికారులను సంప్రదించి అక్కడ నమోదైన టాక్సీ నెంబర్‌ ఆధారంగా డ్రైవరుతో ఫోన్‌కాల్‌లో మాట్లాడారు. కారు వెనుక సీటులో చిన్నారి నిద్రిస్తున్నాడేమో చూడమని పోలీసులు చెప్పగా అప్పటికీ ఆ బాలుడు నిద్రలోనే ఉండటం చూసి డ్రైవరు సైతం ఆశ్చర్యపోయాడు.

తాను పద్నాలుగేళ్లుగా డ్రైవర్‌‌గా పనిచేస్తున్నానని కానీ ఇలా పిల్లాడిని వదిలి వెళ్లిన దంపతులను చూడలేదని చెప్పారు. అనంతరం ఆ డ్రైవరు బాలుడిని విమానాశ్రయ అధికారుల వద్దకు చేర్చారు. తల్లిదండ్రులను పిలిపించిన అనంతరం చిన్నారిని క్షేమంగా అప్పగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios