Asianet News TeluguAsianet News Telugu

దుస్తులు దొంగలించిన టీనేజర్.. దొరికిపోవడంతో..

శనివారం రాత్రి వాళ్ల బాల్కనీలో శబ్దం రావడంతో చూశారు. ఆరేసిన రవి భార్య లోదుస్తులను తీసుకుని ఓ కుర్రాడు పరిగెడుతూ కనిపించాడు. 

couple catch the teenager who is trying to theft cloths in Bhopal
Author
Hyderabad, First Published Jul 12, 2021, 3:07 PM IST

ఓ టీనేజ్ కుర్రాడు.. ఓ ఇంట్లోని దుస్తులు దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. అయితే.. అతనిని ఇంట్లోని దంపతులు పట్టుకున్నారు. పోలీసులకు అప్పగిద్దామని.. ఓ గదిలో బంధించారు. ఆ తర్వాత పోలీసులకు చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి.. సదరు టీనేజర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భోపాల్ కి చెందిన దంపతులు..గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి వాళ్ల బాల్కనీలో శబ్దం రావడంతో చూశారు. ఆరేసిన రవి భార్య లోదుస్తులను తీసుకుని ఓ కుర్రాడు పరిగెడుతూ కనిపించాడు. అతని వెంటాడి పట్టుకున్న ఆ జంట గదిలో వేసి బంధించారు. పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ డోర్‌ తెరిచి చూసేసరికి.. ఫ్యాన్‌ను ఉరేసుకుని చనిపోయాడు. 

అయితే మృతుడి బంధువు ఫిర్యాదు ఆధారంగా ‘ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం కింద రవి, అతని భార్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో ఆ దంపతుల తప్పేమీ లేదని, అవమానంతో ఆ కుర్రాడే ఆత్మహత్య చేసుకున్నాడని చుట్టుపక్కలవాళ్లు చెప్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios