Coronavirus: దేశంలో భారీగా పెరిగిన క‌రోనా మ‌ర‌ణాలు !

Coronavirus: భార‌త్ లో నిత్యం రెండు ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌గా, మ‌ర‌ణాలు క్ర‌మంగా పెరుగుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త క‌రోనా మ‌ర‌ణాలు వేయికి చేరువ‌గా న‌మోద‌య్యాయి. పాజిటివిటీ రేటు 13 శాతం నుంచి 14.50 శాత‌నికి పెరిగింది. ఒమిక్రాన్ కేసులు సైతం పెరుగుతున్నాయి. 
 

Coronavirus Omicron Live: India reports 2.34 lakh new Covid-19 cases, 893 deaths in 24 hours

Coronavirus: అన్ని దేశాల్లోనూ క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ద‌క్షిణాఫ్రికాలో గ‌త న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం పెరిగింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. కోవిడ్‌-19 థ‌ర్డ్ వేవ్ అంచ‌నాలు తీవ్ర భయాందోళ‌న క‌లిగిస్తున్నాయి. క‌రోనా (Coronavirus)మ‌హ‌మ్మారి సాధార‌ణ కేసుల‌తో పాటు ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి.  ఇప్పటికే కరోనా కేసులు మొత్తం దేశంలో నాలుగు కోట్ల మార్కును అందుకున్నాయి. క‌రోనా కేసులు నిత్యం రెండు ల‌క్ష‌ల‌కు పైగా న‌మోద‌వుతున్నాయి. రోజువారీ (Coronavirus) మరణాలు సైతం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. రోజువారీ మ‌ర‌ణాలు వేయికి చేరువ‌గా న‌మోద‌వుతున్నాయి.

దేశంలో క‌రోనా(Coronavirus) ప్రభావం కొన‌సాగుతూనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త  కేసులు న‌మోద‌వుతున్నాయి. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో క‌రోనా మ‌ర‌ణాలు భారీగా పెరిగాయి. కొత్త‌గా 893 మంది క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్త క‌రోనా (Coronavirus)మర‌ణాల సంఖ్య 4,94,091 పెరిగింది. ఇదే సమయంలో 2,34,281 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కరోనా వైరస్ బారినపడ్డవారి సంఖ్య 4,10,92,522 చేరుకుంది. యాక్టివ్ కేసులు సైతం పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 18,84,937 క్రియాశీల కేసులు ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,52,784 మంది క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో మొత్తం క‌రోనా వైర‌స్ (Coronavirus) నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,87,13,494కు పెరిగింది. 

మొత్తం (Coronavirus) కేసుల్లో యాక్టివ్ కేసులు సంఖ్య 4.59 శాతంగా ఉంది. క‌రోనా రిక‌వ‌రీ రేటు 94.21 శాతానికి చేరుకుంది. అయితే, రోజువారీ పాజిటివిటీ రేటు 13 శాతం నుంచి 14.50 శాతానికి పెరగ‌డంపై ఆందోళ‌న వ్యక్త‌మ‌వుతోంది. డైలీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉండ‌గా, వారాంత‌పు క‌రోనా(Coronavirus) పాజిటివిటీ రేటు 16.40 శాతంగా ఉంది. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో దేశంలో వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌లు క‌ఠినంగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వ్యాక్సినేష్ ప్ర‌క్రియ‌తో పాటు క‌రోనా ప‌రీక్ష‌లను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 165.70 కోట్ల (Coronavirus) వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేశారు. ఇందులో మొద‌టి డోసు తీసుకున్న వారు 89.3 కోట్ల మంది ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న‌వారి సంఖ్య 70.6 కోట్ల‌కు పెరిగింది. అలాగే, గ‌త 24 గంట‌ల్లో దేశంలో 16,15,993 క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది. మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 72.93 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని పేర్కొంది. దేశంలో క‌రోనా వైర‌స్  (Coronavirus) ఒమిక్రాన్ (Omicron)వేరియంట్ కేసులు సైతం పెరుగుతున్నాయి.  అయితే, పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో  ఇదివరకు విధించిన కరోనా ఆంక్షలను సడలిస్తున్నాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios