Asianet News TeluguAsianet News Telugu

coronavirus : ముందు జాగ్రత్త డోసు కోసం రిజిస్ట్రేషన్ అసవరం లేదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

జనవరి 10వ తేదీ నుంచి 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు, క‌రోనా వారియ‌ర్స్‌కు క‌రోనా వ్యాక్సిన్ ముందు జాగ్ర‌త్త డోసు ఇవ్వ‌నున్నారు. అయితే ఈ డోసు కోసం ఎలాంటి రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేద‌ని, నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్ల‌వ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

Coronavirus - No need to take precautionary dose .. Clarity given center
Author
Delhi, First Published Jan 8, 2022, 2:21 PM IST

పెరుగుతన్న కరోనా కేసులు నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే కఠిన అంక్షలు అమలు చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ (night curfew), వీకెంట్ కర్ఫ్యూ (weekend curfew) అమలు చేస్తున్నాయి. సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌కు, బ‌హిరంగ స‌మావేశాల‌ను, స‌భ‌ల‌ను, ర్యాలీల‌ను నిషేదించాయి. అలాగే పెళ్లిల‌కు, అంత్య‌క్రియ‌ల‌కు ప‌రిమిత సంఖ్య‌లో మాత్రమే ప్ర‌జ‌లను అనుమ‌తిస్తున్నాయి.

మాస్క్ ధరించ‌డం ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు మాస్క్ ధ‌రించ‌ని వారికి ఫైన్లు కూడా విధిస్తున్నాయి. ఇలా క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేపట్ట‌డంతో పాటు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని కూడా వేగ‌వంతం చేస్తున్నాయి. గ‌తేడాది జ‌న‌వరి 6వ తేదీన దేశంలో ప్రారంభ‌మైన కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నిన్న‌టితో (శుక్ర‌వారం)తో 150 కోట్ల మైలురాయిని దాటింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించారు. ప‌శ్చిమ బెంగాల్ (west beangal) కోల్‌కత్తాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ రెండో క్యాంపస్‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించిన స‌మ‌యంలో ఆయ‌న మాట్లడుతూ ఈ ప్ర‌క‌ట‌న చేశారు. 

వ్యాక్సినేష‌న్ (vaccination) చేప‌ట్ట‌డం ద్వారా క‌రోనా సోకే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఒక వేల సోకినా వ్యాధి తీవ్ర‌త చాలా త‌క్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ చేప‌ట్టింది. అయితే ప్ర‌పంచ దేశాల్లో ఒమ‌క్రాన్ విజృంభిస్తున్న స‌మ‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అలెర్ట్ అయి ఈ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేశారు. వ్యాక్సిన్ వేసుకోవ‌డం వ‌ల్ల హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగి ప్ర‌జ‌ల‌కు కరోనాను త‌ట్టుకునే సామ‌ర్థ్యం వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అందులో భాగంగానే ఇంత వ‌ర‌కు వ్యాక్సిన్ కు అర్హ‌త లేని టీనేజ్ పిల్ల‌ల‌కు కూడా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని భావించింది. 15-18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న పిల్ల‌ల‌కు ఈ నెల 3వ తేదీ నుంచి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే వీరితో పాటు క‌రోనా ముప్పు అధికంగా ఉండే వృద్ధుల‌కు, క‌రోనా వారియ‌ర్స్‌కు కూడా మ‌రో డోసు అధ‌నంగా ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావించింది. అయితే దీనిని బూస్ట‌ర్ డోసు అని  అనుకుండా ముందస్తు డోసు అని మాత్రమే కేంద్ర పేర్కొంది. 

ఈ ముందస్తు డోసువ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జ‌న‌వ‌రి 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ విష‌యంలో కేంద్ర  నేడు ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అద‌న‌పు కోవిడ్ వ్యాక్సిన్ డోసు తీసుకునే వారు ఎలాంటి రిజిస్ట్రేష‌న్స్ లేకుండా నేరుగా వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ కు వెళ్లి డోసు తీసుకోవ‌చ్చ‌ని తెలిపింది. అయితే ఈ ముందస్తు డోసు తీసుకునే 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధులు మాత్రం ముందుగా డాక్ట‌ర్ సూచ‌న తీసుకోవాల్సి ఉంటుంది. శ‌నివారం నుంచి డాక్ట‌ర్ అపాయింట్మెంట్ తీసుకోవ‌చ్చ‌ని సూచించింది.  ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

కేంద్రం మార్గదర్శకాల ప్రకారం... రెండో డోసు పూర్త‌యిన తొమ్మిది నెల‌ల (39 వారాల‌) త‌రువాత మాత్ర‌మే ముందస్తు డోసు ఇస్తారు. దీని కోసం కోవిన్ (Co-WIN ) వెబ్ సైట్  లో న‌మోదైన తేదీని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. తొమ్మిది నెల‌లు పూర్త‌యిన వృద్ధుల‌కు అద‌న‌పు డోసు తీసుకోవాల‌ని మెసేజ్ కూడా వ‌స్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios