కరోనా రికవరీలో భారత్ టాప్ లో ఉంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా భారత్ లో కరోనా రికవరీ రేటు ఉండడం సంతోషాన్ని కలిగించే విషయం. దీంతోపాటు దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. 

అయితే దీనిని చూసి ప్రజలు కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. వరుసగా 33వ రోజు కూడా కరోనా సోకిన వారి కన్నా వ్యాధి నుంచి కోలుకున్నవారి శాతం అధికంగా ఉండంటం ఉపశమనం కలిగిస్తోంది. 

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 20,549 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 26,572 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా రికవరీ రేటు 96 శాతానికి చేరుకుంది. 

ప్రపంచంలోని ఏ దేశంలోని కరోనా రికవరీ రేటు ఈ స్థాయిలో లేదు. కాగా గడచిన 24 గంటల్లో కరోనాతో 286 మంది మృతి చెందారు. దేశం మొత్తంమీద కరోనా బారిపడిన వారి సంఖ్య 1,02,44,852కు చేరింది. వీరిలో 98,43,141 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 2,62,272 యాక్టివ్ కేసులున్నాయి.