కరోనా ఎఫెక్ట్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం

 కరోనాను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మందిని  ఇంటి నుండే పనిచేసేందుకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
 

Coronavirus: Govt employees asked to work from home, working hours staggered


న్యూఢిల్లీ: కరోనాను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మందిని  ఇంటి నుండే పనిచేసేందుకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పనిచేసే గ్రూప్ బీ, గ్రూప్ సీ స్థాయి ఉద్యోగులకు వర్తించనుందని ప్రభుత్వం ప్రకటించింది.గ్రూప్ -ఏ స్థాయి అధికారులకు పని గంటల్లో వెసులు బాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

దేశంలోని 48.34 లక్షల్లో 2.4 లక్షల మంది గ్రూప్ బి అధికారులు ఉన్నారు. 27.7 లక్షల మంది గ్రూప్ సి స్థాయి ఉద్యోగులు ఉన్నారు. 

కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకొనే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ప్రతి రోజూ 50 శాతం ఉద్యోగులు కార్యాలయాలకు హాజరయ్యేలా కేంద్రం నిర్ణయం తీసుకొంది. మిగిలిన 50 శాతం ఉద్యోగులు ఇంటి నుండే పనిచేయనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios