క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 7.2 శాతం తగ్గుదల కనిపించింది. 499 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటివరకు దేశంలో 3.11 కోట్లమందికి పైగా వైరస్ బారినపడగా.. 4,14,108 మంది మహమ్మారికి బలయ్యారు. 

ఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుండగా.. స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాగాజా 38,164 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇక మరణాల సంఖ్య 500 దిగువకు చేరడం కాస్త ఊరట కలిగించే విషయం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 7.2 శాతం తగ్గుదల కనిపించింది. 499 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటివరకు దేశంలో 3.11 కోట్లమందికి పైగా వైరస్ బారినపడగా.. 4,14,108 మంది మహమ్మారికి బలయ్యారు. అలాగే నిన్న 14, 63,593 మంది నమూనాలను సేకరించి పరీక్షంచినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 44.54 కోట్లకు పైగా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పింది. 

ప్రస్తుతం 4,21,665 మంది కరోనాతో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.35 శాతానిక చేరగా.. రికవరీ రేటు 97.32 శాతంగా ఉంది. అలాగే నిన్న 38,660మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.03 కోట్ల మార్కును దాటాయి. ఇక నిన్న 13.63 లక్షల మంది టీకా వేయించుకన్నారు. ఇప్పటిరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 40.64 కోట్లకు చేరింది.