Coronavirus : చైనాలో కరోనా విధ్వంసం.. కఠిన లాక్‌డౌన్ తరువాత షాంఘైలో మొదటి మరణాలు నమోదు

చైనాలో కరోనా మళ్లీ విధ్వంసం సృష్టిస్తోంది. షాంఘై నగరంలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. అయితే ఈ నగరంలో కఠిన లాక్ డౌన్ విధానం అమల్లోకి వచ్చిన తరువాత మొదటి సారిగా కరోనాతో ముగ్గురు చనిపోయారు. 

Corona destruction in China .. Shanghai first deaths recorded after severe lockdown

చైనాలో కరోనా మహమ్మారి మ‌ళ్లీ విళయతాండవం చేస్తోంది. ఈ కోవిడ్ -19 వేవ్ ను నియంత్రించేందుకు గత కొన్ని వారాలుగా చైనా లాక్‌డౌన్ విధించుకుంది. అయితే ఆ దేశంలో ప్ర‌ధాన న‌గ‌ర‌మైన షాంఘైలో ఈ సారి లాక్‌డౌన్ విధించిన త‌రువాత మొదటి సారిగా క‌రోనాతో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

మరణించిన ముగ్గురు 89 నుంచి 91 సంవత్సరాల మధ్య వయస్సు క‌లిగి ఉన్నార‌ని, వారికి ఇత‌ర వ్యాధులు కూడా ఉన్నాయ‌ని షాంఘై న‌గ‌ర పాల‌క సంస్థ తెలిపింది. వారి వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. వారికి క‌రోనా సోకిన త‌రువాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారికి అక్క‌డి సిబ్బంది ట్రీట్ మెంట్ అందించినా ఫ‌లితం లేకుండా పోయింది. వారంతా ప‌రిస్థితి విష‌మించి చ‌నిపోయారు. ఇవి ఈ వేవ్ లో మొద‌టి మ‌ర‌ణాలు. కాగా ఏప్రిల్ 17న షాంఘైలో 19,831 కరోనా కేసులు నమోదయ్యాయి. దాని కంటే ఒక రోజు అంటే ఏప్రిల్ 16వ తేదీన (శ‌నివారం)  21,582 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. 

చైనాలో క‌ఠిన జీరో కోవిడ్ విధానం అమల్లో ఉంది. షాంఘైతో సహా అనేక నగరాల్లో, లాక్‌డౌన్ కార‌ణంగా కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లలోనే ఉండిపోయారు. ఒక్క షాంఘైలోనే దాదాపు 25 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లలోనే నిర్బంధించబడ్డారు. కొత్త వేవ్ త‌రువాత మొదటిసారిగా షాంఘైలో కరోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌డంతో అక్క‌డి ప్ర‌జల్లో ఆందోళ‌న నెల‌కొంది. 2019 సంవత్సరంలో వుహాన్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత షాంఘై ఇప్పటివరకు అత్యధికంగా సోకిన నగరం ఉంది. 

ఈ షాంఘైలో న‌గ‌రంలో కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మార్చి 28వ తేదీన చైనా అతి పెద్ద న‌గ‌రం అయిన షాంఘైలో Omicron వేరియంట్ వ్యాపించింది. దీనిని నియ‌త్రించ‌డానికి రెండు-దశల లాక్‌డౌన్‌ను అక్క‌డి ప్ర‌భుత్వం అమ‌లు చేసింది. ఇతర న‌గ‌రాల్లోనూ ఈ కేసులు పెరుగుతుండ‌టంతో అక్క‌డ కూడా ఆంక్ష‌లు విధిస్తున్నారు. చైనాలోని వాయువ్య నగరమైన జియాన్‌లో ఈ నెల ప్రారంభం నుంచి కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా తమ ఇళ్ల నుంచి బ‌య‌టకు రాకూడ‌ద‌ని స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

చైనాతో పాటు ప‌లు దేశాల్లోనూ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పాండ‌మిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీ ఇంకా తొల‌గిపోలేద‌ని చెప్పింది. ప్ర‌స్తుతం కొత్త వేరియంట్లు పుట్టుకురావ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యమని తెలిపింది. ఎప్పటిక‌ప్పుడు క‌రోనా వేరియంట్ల‌పు త‌మ ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయ‌నీ, ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తూనే ఉన్నామ‌ని వెల్ల‌డించింది. మున్ముందు క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తే.. దానికి త‌గ్గ‌ట్టుగా చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ప్ర‌పంచ దేశాలు సిద్ధంగా ఉండాల‌ని సూచించింది. ప్ర‌స్తుతం ఉప‌శ‌మ‌నం క‌లిగించే అంశాల్లో కోవిడ్-19 మ‌ర‌ణాలు త‌గ్గ‌టం ఒక‌ట‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల‌ల్టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్  అన్నారు. క‌రోనావైర‌స్‌ మహమ్మారి ప్రారంభ రోజులతో పోలిస్తే గత వారం మొద‌టి నుంచి కోవిడ్ మ‌ర‌ణాలు త‌గ్గాయ‌ని ఆయ‌న చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios