మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఆయనకు నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీని ఓ హిందుత్వ వాది చంపేశాడని పేర్కొన్నారు. హిందుత్వ వాదులు అందరూ ఆయన ఇక లేరని విర్రవీగుతున్నారని, కానీ, సత్యం ఎక్కడైతో ఉంటుందో అక్కడ ఆయన ఎప్పటికీ సజీవంగా ఉంటారని ట్వీట్ చేశారు. మహాత్మా గాంధీని 1948లో ఇదే రోజున నాథురాం గాడ్సే తుపాకీతో కాల్చి చంపాడు. జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతినే మార్టిర్స్ డేగా దేశం పాటిస్తున్నది. రాహుల్ గాంధీ రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధికి నివాళులు అర్పించారు. 

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమర యోధుడు, జాతి పిత మహాత్మా గాంధీ(Mahatma Gandhi) 74వ జయంతి సందర్భంగా కాంగ్రెస్(Congress) పార్టీ నివాళులు అర్పించింది. మహాత్మా గాంధీ జయంతి(Death Anniversary) రోజునే అమర వీరుల దినోత్సవంగా(Martyrs Day) జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ హిందుత్వవాదినే మహాత్ముడిని చంపేశాడని ఆయన ట్వీట్ చేశారు. హిందుత్వవాదులు అందరూ గాంధీజి లేడని భావిస్తుంటారని పేర్కొన్నారు. సత్యం ఎక్కడైతే నిలిచి ఉందో బాపు అక్కడ సజీవంగా ఉన్నారని తెలిపారు. గాంధీ ఫరేవర్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఈ విధంగా ట్వీట్ చేశారు.

మహాత్మా గాంధీని 1948లో ఇదే రోజున నాథురాం గాడ్సే తుపాకీతో కాల్చి చంపాడు. జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతినే మార్టిర్స్ డేగా దేశం పాటిస్తున్నది. రాహుల్ గాంధీ రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఈ విధంగా ట్వీట్ చేశాడు. అంతేకాదు, మహాత్మా గాంధీ కొటేషన్‌నూ ఆయన ట్వీట్ చేశాడు. ‘నేను నిరాశలో ఊగిసలాడుతున్నప్పుడు చరిత్ర పొడుగునా సత్యం, ప్రేమలే గెలుపొందాయనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాను. ఎంతో మంది నియంతలు, హంతకులు చరిత్రలో ఉన్నారు. కొన్ని సార్లు వారు అజేయులుగా కొనసాగారు. కానీ, చివరకు వారి శకం ముగియక తప్పలేదు. నేను ఎప్పుడూ అదే ఆలోచిస్తున్నాను’ అని ట్వీట్ చేశాడు.

కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా మహాత్మా గాంధీ కూడా అహింసపై మహాత్మా గాంధీ చేసిన కోట్‌ను ట్వీట్ చేశారు. కాగా, కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ కూడా ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేసింది. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్టు పేర్కొంది. ఇదే రోజు షహీద్ దివస్‌నూ పాటిస్తారని వివరించింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ధైర్యశాలురైన మహిళలు, పురుషులకు సెల్యూట్ చేస్తున్నట్టు వివరించింది. ప్రస్తుత కఠిన పరిస్థితులను దాటి వెళ్లడానికి నాయకత్వం వహించే బాపు మన మధ్యలో ఇప్పుడు లేకపోయినా.. నిరంకుశులు, అన్యాయాలపై ఆయన నిర్విరామంగా, నిర్భయంగా చేసిన పోరాటాలు ఎప్పటికీ మనకు దారి చూపుతాయని పేర్కొంది. ఆయన చూపిన దారిలో వెళ్తూ దేశ పురోగతికి తోడ్పడతామని వివరించింది.

కాగా, Mahatma Gandhi వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం నాడు రాజ్‌ఘాట్ లో గాంధీ సమాధి వద్ద రాష్ట్రపతి Ramnath Kovind, ప్రదాని Nrendra Modi సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. Raj ghat లో జాతిపిత గాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత గాంధీ గురించి మోడీ గుర్తు చేసుకొన్నారు. గాంధీ ఆశయాలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సమిష్టి ప్రయత్నం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీ మహోన్నతమైన ఆశయాలను మరింతగా ప్రచారం చేయడమే తమ సమిష్టి ప్రయత్నమన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతిని ధైర్యంగా కాపాడిన మహానీయులందరికీ ఆయన నివాళులర్పించారు.

కేంద్ర మంత్రి Amit Shah కూడా బాపుఘాట్ వద్ద నివాళులర్పించారు. ప్రతి భారతీయుడి హృదయంలో స్వదేశీ, స్వభాష, స్వరాజ్ స్పూర్తిని గాంధీ నిలిపారన్నారు. గాందీ ఆలోచనలు, ఆదర్శాలు దేశానికి సేవ చేసేందుకు ప్రతి భారతీయుడికి ఎల్లప్పుడూ స్పూర్తిని కల్గిస్తాయని అమిత్ షా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.