కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బూటా సింగ్ కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన కన్నుమూశారు. బూటా సింగ్ వయసు 86 సంవత్సరాలు. కాగా.. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

బూటాసింగ్.. తన రాజకీయ రంగ ప్రవేశం తొలుత అకాళీ దళ్ ద్వారా  చేశారు. ఆ పార్టీ నుంచే ఆయన తొలుత ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత  1960లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.  1962లో ఆయన తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. సాధనా నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.
ఆ తర్వాత చాలా కీలక పదవులను అదిరోహించారు. కేంద్ర హోం శాఖ మంత్రిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

2007-2010 సంవత్సర కాలం మధ్య ఆయన నేషనల్ కమిషన్ ఛైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. బూటాసింగ్ కి పుస్తకాలు, ఆర్టికల్ రాసే అలవాటు కూడా ఉ:ది. ఆయన దగ్గర పంజాబి లిటరేచర్ కి సంబంధించి చాలా కలెక్షన్ ఉంది. సిక్కు చరిత్ర మీద ప్రత్యేకంగా ఓ పుస్తకం కూడా రాశారు.