Asianet News TeluguAsianet News Telugu

'కొత్త పార్లమెంట్‌ భవనం మోడీ మల్టీప్లెక్స్' .. జైరాం రమేష్ ప్రకటనపై బీజేపీ ఫైర్

నూతన పార్లమెంట్ భవనాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకపడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ప్రకటనను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా  తీవ్రంగా ఖండించారు. 

Congress Jairam Ramesh calls new parliament a Modi multiplex. BJP chief JP Nadda hits back KRJ
Author
First Published Sep 24, 2023, 5:52 AM IST

పార్లమెంట్‌ కొత్త భవనం మోడీ మల్టీప్లెక్స్ లేదా మోడీ మారియట్ అని కాంగ్రెస్ విమర్శించింది. నూతన పార్లమెంట్ లో చర్చలు కనుమరుగయ్యాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌  సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పించారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని పూర్తి ఉత్సాహంతో ప్రారంభించామని జైరాం రమేష్ రాశారు. ఇది నిజానికి ప్రధాని మోదీ లక్ష్యాలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. నూతన పార్లమెంట్ భవనంలో జరిగిన నాలుగు రోజుల సమావేశాలను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.  

కొత్త పార్లమెంటు భవనాన్ని 'మోదీ మల్టీప్లెక్స్' అని పిలిచారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన కొత్త పార్లమెంట్ భవనం ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యాలను మాత్రమే నెరవేరుస్తోందని అన్నారు. దీన్ని 'మోడీ మల్టీప్లెక్స్' లేదా 'మోడీ మారియట్' అని పిలవాలి. చాలా లోటుపాట్లను ఆయన ప్రస్తావించారు. 

'పాత భవనం అనువుగా ఉండేది'

పాత పార్లమెంట్ భవనంలో ప్రతి సభ్యుడితో చర్చలు జరిపేందుకు అనువుగా ఉండేదనీ, నూతన పార్లమెంట్ లోని హాళ్లు అస్సలు సౌకర్యవంతంగా లేదనీ, ఒకరినొకరు చూసుకోవడానికి బైనాక్యులర్లు అవసరమవుతాయని ఏద్దేవా చేశారు.  పాత భవనం ఒక ప్రకాశం కలిగి ఉంది  సంభాషణ కూడా సులభంగా ఉండేదని అన్నారు. 

సెంట్రల్ హాల్, కారిడార్‌లలో నడిచేందుకు వీలు ఉండేదనీ, కానీ ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తోందని అన్నారు. పాత భవనంలో దారి తప్పిపోతే.. వృత్తాకారంలో ఉన్నందున మీరు మార్గం సులభంగా కనుగొనవచ్చు.కానీ,  కొత్త భవనంలో మీరు దారి తప్పిపోతే చిట్టడవిలో తప్పిపోయినట్టేననీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాత బిల్డింగ్‌లో ఓపెన్‌నెస్ ఫీలింగ్, కొత్త బిల్డింగ్‌లో క్లోజ్డ్ ప్లేస్‌లో ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించిందని అన్నారు. .

పార్లమెంటు హౌస్‌ను సందర్శించిన ఆనందం కనుమరుగైందని జైరాం రమేష్ అన్నారు. తాను పాత భవనంలోకి వెళ్లడానికి ఎదురుచూస్తున్నానని అన్నారు. పార్టీ శ్రేణులకు అతీతంగా చాలా మంది లోక్ సభ సభ్యులు ఇలానే భావిస్తున్నారని అన్నారు. బహుశా 2024లో అధికార బదలాయింపు తర్వాత పాత పార్లమెంట్ భవనాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చని జైరాం రమేష్ అన్నారు. 

నూతన పార్లమెంట్ భవనాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై బీజేపీ నేతలు విరుచుకపడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ప్రకటనపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ దయనీయ మనస్తత్వమని, ఇది దేశంలోని 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అవమానించడమేనని, కాంగ్రెస్‌ను పార్లమెంటు వ్యతిరేకి అని అన్నారు. పార్లమెంట్‌ను కాంగ్రెస్‌ వ్యతిరేకించడం ఇదే తొలిసారి కాదని నడ్డా అన్నారు. 1975లో కూడా కాంగ్రెస్ ఈ ప్రయత్నమే చేసిందని, అయితే ఘోరంగా విఫలమయ్యారని గుర్తు చేశారు. 

ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ ఆగ్రహం

జైరాం రమేష్ సోషల్ మీడియా పోస్ట్‌పై ఆర్‌ఎస్‌ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ స్పందిస్తూ.. 'కొత్త పార్లమెంట్ ఇప్పుడు వాస్తవరూపం దాల్చింది. పాత పార్లమెంటుకు వెళ్తానని చెప్పనందుకే జైరాం రమేష్ కొత్త పార్లమెంట్ ఏర్పాటు చేస్తానని చెబుతున్నా. ద్వేషం, శత్రుత్వాలకు అతీతంగా దేశాభివృద్ధికి ఐక్యంగా పని చేయాలని పార్టీ నేతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. 

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా సెప్టెంబర్ 19 నుండి కొత్త పార్లమెంటు భవనంలో పనులు అధికారికంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.  గణేష్ చతుర్థి సందర్భంగా ప్రధాని మోదీ నేతృత్వంలో ఎంపీలు కొత్త పార్లమెంట్ హౌస్‌లో కూర్చున్నారు. పాత పార్లమెంటును ఇప్పుడు 'రాజ్యాంగ సభ'గా పిలుస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios