Punjab Assembly Election 2022: పంజాబ్ ఎన్నికలకు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అందరూ ఊహించినట్లే ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసింది.
Punjab Assembly Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు కాక రేపుతున్నాయి. రోజుకో ట్విస్ట్.. పూటకో మలుపు అన్నట్టుగా పంజాదీ పాలిటిక్స్ సాగుతున్నాయి. ఎన్నో రోజులుగా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు నేటీతో తెరపడింది. ఎట్టకేలకు పంజాబ్ కాంగ్రెస్ తన పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. అందరూ ఊహించనట్టుగానే.. చరణ్‌జిత్ సింగ్ చన్నీ వైపే.. కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుంది. సీఎం అభ్యర్థిత్వం కోసం ఎంతగానే ఎదురు చూస్తున్నా.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూకి భంగపాటు తప్పలేదు.
పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి మరొకవైపు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ ల మధ్య హోరా హోరీ పోరు సాగింది. ఈ వివాదానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం చరణ్‌జిత్ సింగ్ చన్నీకే మొగ్గు చూపిందనీ, చన్నీనే కాంగ్రెస్ తరపు సీఎం అభ్యర్థి అని రాహుల్ గాంధీ ప్రకటించారు.
ఈ విషయంలో తొలుత కాంగ్రెస్ అధిష్టానంపై నవజ్యోత్‌సింగ్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరసటి రోజే.. రాహుల్ గాంధీ నిర్ణయాన్ని తాను ఆమోదిస్తామని పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రకటించారు. అయినా.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తప్పవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చన్నీనే ఎందుకు?
చన్నీనే సీఎం అభ్యర్థిగా ఎన్నుకోవడానికి పలు కారణాలున్నాయి. పంజాబ్ జనాభాలో దళితులు 32 శాతం మంది ఉన్నారు. దళిత సీఎం అయిన చన్నీ.. ఆ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా దళిత వ్యక్తులు సీఎం పదవీలో లేరు. ఈ విషయం కాంగ్రెస్ కు కలిసి వస్తుందని అధిష్టానం భావించింది. ఈ విషయంతో కేవలం.. పంజాబ్ ఎన్నికల్లోనే కాకుండా.. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచార ఆస్త్రంగా ఉపయోగించుకోవచ్చని కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం.
చన్నీ పంజాబ్ సీఎంగా కేవలం 110 రోజులు బాధ్యతలు నిర్వహించినా.. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ తక్కువ కాలంలోనే.. మరే ఇతర సీఎంలు ఇంత వేగంగా తమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. చన్నీని సాధారణ మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలకు సానుకూల సందేశం వెళ్తుందని భావించింది.
సీఎం అభ్యర్థి రేసులో పంజాబ్ చీఫ్ సిద్దూ ఉన్నప్పటికీ.. ఆయనను సీఎం అభ్యర్తత్వానికి ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో సన్నిహిత బంధాలున్నాయనే కారణంతో సిద్దూను సీఎంగా ఎంపిక చేసే సాహసం చేయలేదు కాంగ్రెస్ అధిష్టానం. పార్టీలో అంతర్గ కుమ్ములాట ఫలితంగా చన్నీని సీఎం అభ్యర్థిగా ఎంచుకుంది. ఈ నిర్ణయం కాంగ్రెస్ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో , అలాగే సిద్ధూ ఏవిధంగా స్పందిస్తాడో ? వేచి చూడాల్సిందే.
