కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో సోమవారం కీలక సమావేశం జరిగింది. ఢిల్లీ 10 జన్‌పథ్‌లోని ఆమె నివాసంలో జరిగిన సమావేశంలో పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకన్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో సోమవారం కీలక సమావేశం జరిగింది. ఢిల్లీ 10 జన్‌పథ్‌లోని ఆమె నివాసంలో జరిగిన సమావేశంలో పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకన్నారు. ఈ సమావేశంలో వచ్చే నెలలో రాజస్తాన్ ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. మే 13 నుంచి 15 వరకు ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శిబిర్‌ను సమావేశపరచాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించారని చెప్పారు.
ఇక, ఉదయ్‌పూర్‌లో నిర్వహించనున్న చింతన్ శిబిర్‌కు ఏఐసీసీ, సీడబ్ల్యూసీ సభ్యులు హాజరుకానున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు చింతన్ శిబిర్‌లో పాల్గొనేందుకు ఆహ్వానం పంపనున్నారు. దాదాపు 400 మంది ఈ చింతన్ శిబిర్‌కు హాజరు అవుతారాని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.
గత వారం ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ నెల 21న సమర్పించిన నివేదికపై నేటి సమావేశంలో చర్చించనట్టుగా చెప్పారు. 2024 ఎన్నికలకు ముందు ఎదురయ్యే రాజకీయ సవాళ్లను పరిష్కరించడానికి సాధికారత యాక్షన్ గ్రూప్ (Empowered Action Group) ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్ణయించినట్టుగా సుర్జేవాలా తెలిపారు. ఇదిలా ఉంటే ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ చేరిక అంశంపై మాత్రం కాంగ్రెస్ సస్పెన్స్ కొనసాగిస్తుంది.
ఇక, వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌కు కొన్ని సూచనలు చేసిన సంగతి తెలిసిందే. పీకే సూచనల మేరకు సోనియా గాంధీ.. కాంగ్రెస్ నేతలతో కమిటీ వేశారు. ఈ కమిటీ తన నివేదికను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించింది. ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలను అంగీకరించాలా..? వద్దా.? అనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ నేతల చర్చలు జరుపుతున్నారు. నేడు సోనియా గాంధీతో జరిగిన సమావేశంలో ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా, పి చిదంబరంతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలోకి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాలపై నేతలు చర్చించారు. అలాగే పార్టీలోకి తీసుకుంటే ఏ విధమైన బాధ్యతలు అప్పగించాలనే అంశాలపై చర్చలు జరుపుతున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ విషయంలో ఇప్పటికే గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.
ఇప్పటికే సోనియా గాంధీతో పలుమార్లు సమావేశమైన ప్రశాంత్ కిషోర్.. గత కొంతకాలంగా వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేయడానికి తన ప్రణాళికపై వివరణాత్మక ప్రదర్శనలు ఇచ్చాడు.అయితే.. కాంగ్రెస్‌కు ప్రత్యర్థులుగా ఉన్న కొన్ని పార్టీలతో పీకే పనిచేస్తున్న కారణంగా కాంగ్రెస్ సీనియర్లలో ఒక విభాగం ఆయన చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
