సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 16 మందితో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ)ని నియమించింది కాంగ్రెస్ పార్టీ. తెలుగు రాష్ట్రాల నుంచి నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కరికే చోటు దక్కింది.  

సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గేరు మార్చింది. 16 మందితో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ)ని నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పేరుతో ప్రకటన విడుదలైంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కరికే చోటు దక్కింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సీఈసీ సభ్యులు వీరే :

  1. మల్లిఖార్జున ఖర్గే
  2. సోనియా గాంధీ
  3. రాహుల్ గాంధీ
  4. అంబికా సోనీ
  5. అధిర్ రంజన్ చౌదరి
  6. సల్మాన్ ఖుర్షిద్
  7. మధుసూదన్ మిస్త్రీ
  8. ఉత్తమ్ కుమార్ రెడ్డి
  9. టీఎస్ సింగ్ దేవ్
  10. కేజీ జార్జ్
  11. ప్రీతమ్ సింగ్
  12. మహమ్మద్ జావెద్
  13. అమీ యాజ్ఞిక్
  14. పీఎల్ పూనియా
  15. ఓంకార్ మర్కామ్
  16. కేసీ వేణుగోపాల్

Scroll to load tweet…