ఒరిస్సా ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరుసగా అయిదోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. బిజూ జనతా దళ్(BJD) ను జెండాను మరోసారి ఎగరేసి తన సత్తా చాటుకున్నారు. ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు లోక్ సభ ఎన్నికలు రెండు ఒకేసారి జరిగాయి. 

అక్కడి ప్రజలు రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ కె పట్టం కట్టినప్పటికీ లోక్ సభ విషయానికి వచ్చేసరికి మాత్రం కొంత మేర మోడీ హవా వల్ల 21 లోక్ సభ సీట్లలో దాదాపు 9 సీట్లలో బిజెపికి పట్టం కట్టే విధంగా కనబడుతున్నారు. 

నవీన్ బాబు అంటూ అక్కడి ప్రజలు ఎంతో ఇష్టంగా పిలుచుకునే నవీన్ పట్నాయక్ కు గ్రామీణ ఓటర్లలో బలమైన పట్టు ఉంది. సంక్షేమ పథకాలు మహిళా స్వయం సహాయక పొదుపు సంఘాల సక్సెస్సే నవీన్ సక్సెస్ కి కారణం. ఫైనల్ గా శంఖం మోగేలా నవీన్ పట్నాయక్ భారీ విజయాన్ని అందుకున్నారు.