Asianet News TeluguAsianet News Telugu

యువకుడి ప్యాంట్ లోకి దూరిన పాము.. ఏడు గంటలపాటు..

ఆ కార్మికుల‌లో ఒక‌డైన లవ్లేష్ నిద్రిస్తుండ‌గా, ఒక‌ విషపూరిత పాము అత‌ని ప్యాంటులోకి దూరింది. 

cobra snake enters young man jeans pant while sleeping man stand for 7 hours
Author
Hyderabad, First Published Jul 30, 2020, 10:20 AM IST

పాము కళ్లెదురుగా వెళితేనే చూసి జడుసుకుంటాం. అలాంటిది ప్యాంట్.. మీదకి ఎక్కితే.. అందులోనూ ప్యాంట్ లోపలికి దూరితే.. ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదూ. మనకు ఊహించుకోవడానికి అంత భయానకంగా ఉన్న పరిస్థితిని  ఓ యువకుడు ఎదురుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఒక పెద్ద పాము యువకుడు ధ‌రించిన‌ జీన్స్ ప్యాంటులోకి దూరింది. దీంతో ఆ యువకుడు రాత్రంతా స్తంభం పట్టుకొని, భయాందోళనతో క‌ద‌ల‌కుండా నిలుచున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... జమాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సికందర్‌పూర్‌ గ్రామంలో విద్యుత్‌శాఖ విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేసే పనులు నిర్వ‌హిస్తోంది. ఈ ప‌నులు చేసేందుకు వ‌చ్చిన కార్మికులు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో రాత్రిపూట నిద్రిస్తున్నారు. ఆ కార్మికుల‌లో ఒక‌డైన లవ్లేష్ నిద్రిస్తుండ‌గా, ఒక‌ విషపూరిత పాము అత‌ని ప్యాంటులోకి దూరింది. 

భ‌యంతో ఆ యువ‌కుడు వెంట‌నే లేచి అక్క‌డే ఉన్న స్తంభాన్ని ప‌ట్టుకుని, క‌ద‌లకుండా రాత్రంతా నిలుచున్నాడు. ఉద‌యం‌ స్థానికులు ఈ విష‌యాన్ని తెలుసుకుని, ద‌గ్గ‌ర‌లో ఉన్న పాములు ప‌ట్టే వ్య‌క్తిని పిలిపించారు. అత‌ను సంఘ‌ట‌నా స్థలానికి చేరుకుని ల‌వ్లేష్ ప్యాంటులోకి దూరిన పామును అత్యంత చాక‌చ‌క్యంగా బ‌య‌ట‌కు తీశారు. 

ఈ సందర్భంగా పంచాయతీ సభ్యుడు మహేష్ సింగ్ మాట్లాడుతూ ల‌వ్లేష్ అనే కార్మికుని ప్యాంటులోకి పాము దూర‌డంతో అత‌ను భయంతో క‌ద‌లకుండా ఏడు గంట‌ల‌పాటు నిలుచున్నాడ‌‌ని తెలిపారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా అంబులెన్స్‌ను కూడా పిలిపించామ‌న్నారు. అయితే పాములు ప‌ట్టేవారి చొర‌వ‌తో ఆ పామును బ‌య‌ట‌కు తీయ‌గ‌లిగామని అన్నారు. ల‌వ్లేష్‌కు ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios