ఎన్నికల వేళ చీలిపోయారో అంతే సంగతి ... మళ్ళీ రాళ్లదాడులే : మహారాష్ట్ర ప్రజలకు యోగి వార్నింగ్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచాారాన్ని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హోరెత్తిస్తున్నారు. ఆయన హిందువులు చీలిపోతే పరిస్థితి ఎలా వుంటుందో ప్రజలకు వివరించారు.  

 

CM Yogi Adityanath campaigns for BJP in Maharashtra Election 2024 AKP

 నాగపూర్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. రామనవమి, వినాయక చవితి ఊరేగింపులపై రాళ్ల దాడి, దౌర్జన్యాలు జరిగేది మనం చీలిపోయిన చోటే... గతంలో అయోధ్య, కాశీ, మధురలో కూడా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. అమరావతిలో లోక్‌సభ ఎన్నికల్లో హింస జరిగిందని గుర్తుచేసారు. హిందువులు చీలిపోవడం వల్లే ఇలా ఎంతో నష్టపోతున్నారు... మనం విడిపోతే రామనవమి, గణపతి ఊరేగింపులపై మళ్ళీ రాళ్ల దాడులు జరుగుతాయని హెచ్చరించారు.

లవ్, ల్యాండ్ జిహాద్ రోజురోజుకు ఎక్కువ అవుతోంది... వీటివల్ల మన భూములను అన్యాయంగా ఆక్రమిస్తారు, ఆడపిల్లల భద్రత ప్రమాదంలో పడుతుందన్నారు. కులం పేరుతో విడగొట్టే నాయకులు దేశానికి ద్రోహం చేస్తున్నారని ప్రజలను హెచ్చరించారు. మనం విడిపోకూడదు, విడిపోతే నష్టపోతాం. కలిసి ఉంటే సురక్షితంగా ఉంటామని మహారాష్ట్ర ప్రజలకు యోగి సూచించారు.

మహారాష్ట్ర లవ్,ల్యాండ్, పాన్ కార్డ్ జిహాద్ కేంద్రంగా మార్చారు

మహారాష్ట్రలో రెండు పెద్ద కూటముల మధ్య ఎన్నికల పోరు జరుగుతుందని సీఎం యోగి అన్నారు. ఒకవైపు ప్రధాని మోదీ నాయకత్వంలో 'ఒకే భారతం-శ్రేష్ఠ భారతం' నిర్మించడానికి బీజేపీ మహాకూటమి ఉంది. మరోవైపు దేశ గౌరవాన్ని దెబ్బతీసే, మహారాష్ట్రను లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, పాన్ కార్డ్ జిహాద్ కేంద్రంగా మార్చే మహాకూటమి ఉంది. వీరికి నాయకుడు లేడు, విధానం లేదు అంటూ యోగి మండిపడ్డారు.

దేశంలో కీలక రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రయోగశాల కాకూడదు... కాబట్టి ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, మతమార్పిడులు, పాన్ కార్డ్ జిహాద్ సమస్యలకు బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే పరిష్కారమని అన్నారు. ఈ ప్రభుత్వం బుల్లెట్ వేగంతో అభివృద్ధి చేస్తుంది, దేశద్రోహులను 'రామ్ నామ్ సత్య' యాత్రకు పంపుతుందని యోగి హెచ్చరించారు.

CM Yogi Adityanath campaigns for BJP in Maharashtra Election 2024 AKP

ప్రధాని మోదీ నాయకత్వంలో కొత్త భారతాన్ని చూస్తున్నామని సీఎం యోగి అన్నారు. ఇప్పుడు కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం లేదు. తొలిసారిగా కశ్మీర్‌లో ఎన్నికైన ప్రభుత్వం భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిందన్నారు. జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ, సెక్రటేరియట్‌లో జాతీయ జెండా ఎగురుతోందన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ చేయలేని పనిని ప్రధాని మోదీ, బీజేపీ చేశారు... 370 రద్దుతో పాకిస్తాన్, దాని మద్దతుదారులు ఇబ్బంది పడుతున్నారని సీఎం యోగి అన్నారు.

ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని సీఎం యోగి అన్నారు. 1946లో కూడా ఇలాంటి ఎన్నికలే జరిగాయి.. అవి భారతదేశ భవిష్యత్తును దురదృష్టంలోకి నెట్టాయన్నారు. యూపీఏ, ఎన్డీఏ కూటముల మధ్య తేడాను వివరించారు యోగి. 2014కి ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశం ఖర్చుతో పాకిస్తాన్‌తో సంబంధాలు పెట్టుకుంది...  కానీ మోదీ హయాంలో భారత్ పాకిస్తాన్ పై ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ లు చేస్తోందన్నారు. శత్రువులకు భయం ఉండాలి... అది భారతదేశం బలంగా ఉన్నప్పుడే సాధ్యమని  యోగి అన్నారు.

కాంగ్రెస్ కాలంలో మహారాష్ట్రలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు... కానీ నేడు రైతులు కిసాన్ సమ్మాన్ నిధి పొందుతున్నారని యోగి పేర్కొన్నారు. యూపీలోని ప్రమాదకర మాఫియాకు కాంగ్రెస్ నెలల తరబడి తమ హయాంలో రక్షణ కల్పించిందని, తాము సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడి మరీ వారి ఆగడాలు కట్టించామని యోగి తెలిపారు. 

CM Yogi Adityanath campaigns for BJP in Maharashtra Election 2024 AKP

కాంగ్రెస్ ఉనికిని అంతం చేసే సమయం వచ్చింది

కాంగ్రెస్‌కు 60-65 ఏళ్లు అధికారంలో ఉండే అవకాశం వచ్చింది, కానీ వారు రామమందిరం నిర్మించలేదు... ఎందుకంటే రాముడు వారి అజెండాలో లేరని సీఎం యోగి అన్నారు. రాముడు, కృష్ణుడు లేరని వారు అంటారు, సృష్టి ప్రారంభంలో కాంగ్రెస్ పుట్టిందని వారు భావిస్తున్నారని ఎద్దేవా చేసారు. మన ఉనికిని కాదనే కాంగ్రెస్ ఉనికిని అంతం చేసే సమయం వచ్చిందన్నారు. హర్యానాలో హ్యాట్రిక్ తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలే ఏర్పడతాయనే ధీమా పెరిగిందని యోగి అన్నారు.

భారత్‌లో ఉండి పాకిస్తాన్ జెండా ఎగురవేసేవాడిని అక్కడికే పంపాలి... ఇక్కడ ఉండి భారతమాతను, దైవ మహాపురుషులను అవమానించడం ఆమోదయోగ్యం కాదన్నారు. 2025 ప్రయాగరాజ్ కుంభమేళాకు మహారాష్ట్ర ప్రజలను సీఎం ఆహ్వానించారు.

CM Yogi Adityanath campaigns for BJP in Maharashtra Election 2024 AKP

 మహారాష్ట్ర భారతదేశానికి ప్రేరణా స్థలమని సీఎం యోగి అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, బాల గంగాధర్ తిలక్, సాహుజీ మహారాజ్, పేష్వా బాజీరావ్, వీర్ సావర్కర్, బాబాసాహెబ్ అంబేడ్కర్‌లను స్మరించుకున్నారు. నాగపూర్ నేల ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక, సాంస్కృతిక సంస్థ అయిన ఆర్ఎస్ఎస్‌కు పునాది వేసిందని యోగి అన్నారు.

ఈ అభ్యర్థులకు గెలిపించాలన్న సీఎం యోగి

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అచల్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ తాయడే, మేల్‌ఘాట్ నుంచి కేవల్‌రామ్ కాలే, మోర్షి నుంచి ఉమేష్ (చందు) యావల్కర్, అకోలా తూర్పు నుంచి రణధీర్ సావర్కర్, అకోలా పశ్చిమ నుంచి అభ్యర్థి విజయ్ కమల్‌కిషోర్ అగర్వాల్, బాలాపూర్ నుంచి బలిరామ్ సిర్స్కర్ (శిందే వర్గం), నాగపూర్ దక్షిణం నుంచి మోహన్ గోపాల్ రావు మాటే, నాగపూర్ మధ్య నుంచి ప్రవీణ్ ప్రభాకర్ రావు దత్కేలకు మద్దతుగా ప్రచార సభలు నిర్వహించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios