బాలున్ని కొట్టిచంపిన తోటి విద్యార్థులు....

Class 10 student beaten to death in Delhi government school
Highlights

దేశ రాజధాని డిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై కొందరు ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల గ్యాంగ్ దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి మృత్యువాతపడ్డాడు.

దేశ రాజధాని డిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిపై కొందరు ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల గ్యాంగ్ దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి మృత్యువాతపడ్డాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. డిల్లీలోని బాబర్ పూర్ ప్రాంతానికి చెందిన గౌరవ్ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతంలో తల్లిదండ్రులు, ఓ సోదరుడితో పాటు నివాసముంటున్నాడు.

అయితే గౌరవ్ తన క్లాస్ టీచర్ ని కలవడానికి జ్యోతినగర్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ స్కూల్ కి చెందిన విద్యార్థులు ఇతడితో ఘర్షణకు దిగారు. గౌరవ్ పట్టుకుని విచక్షణా రహితంగా ఆ విద్యార్థుల గ్యాంగ్ దాడికి పాల్పడింది. దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న గౌరవ్ సోదరుడు గోవింద్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే గౌరవ్ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.

ఈ దాడిపై మృతుడి తల్లిదండ్రుల నుండి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఈ దాడిలో పాల్గొన్న కొంతమంది విద్యార్థులను గుర్తించి కేసులు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరికొంత మంది ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్నామని  ఈ విద్యార్థి హత్యతో సంబంధమున్న ప్రతి ఒక్కరిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

loader