ఫిబ్రవరి 7న ICSE, ISC సెమిస్టర్ 1 పరీక్షా ఫలితాలను విడుదల చేయనుంది CISCE . కౌన్సిల్ వెబ్‌సైట్ www.cisce.org ద్వారా నేరుగా రీచెక్‌ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కౌన్సిల్ కల్పించింది. ఒక్కో టాపిక్‌కు రూ.1000 రీచెకింగ్ ఖర్చు ఉంటుంది. ఇందుకు ఫిబ్రవరి 7 ఉదయం 10 గంటల నుంచి  ఫిబ్రవరి 10 ఉదయం 10 గంటల వరకు దరఖాస్తుకు గడువు విధించారు. 

కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ (CISCE) ఫిబ్రవరి 7న ICSE , ISC (10 మరియు 12 తరగతులు) రెండింటికీ సెమిస్టర్ 1 పరీక్షా ఫలితాలను విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు మార్కు షీట్‌లు cisce.org , ఇతర వెబ్‌సైట్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉండనున్నాయి. కౌన్సిల్ వెబ్‌సైట్ www.cisce.org ద్వారా నేరుగా రీచెక్‌ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కౌన్సిల్ కల్పించింది. ఒక్కో టాపిక్‌కు రూ.1000 రీచెకింగ్ ఖర్చు ఉంటుంది. ఇందుకు ఫిబ్రవరి 7 ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 10 ఉదయం 10 గంటల వరకు దరఖాస్తుకు గడువు విధించారు. 

మార్క్‌షీట్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

  • www.cisce.org వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. 'Results 2021-22 Semester 1' లింక్ క్లిక్ చేయండి
  • అనంతరం వచ్చే డ్రాప్ డౌన్ మెనూలో మీరు ICSE కిందకి వస్తారా.. లేక ISC సిలబస్ చదువుతున్నారో సెలక్ట్ చేసుకోవాలి
  • తర్వాత యూనిక్ ఐడీ, ఇండెక్స్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి
  • వెంటనే మీ రిజల్ట్స్ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకుని డౌన్‌లోడ్ బటన్ ప్రెస్ చేయాలి
  • అనంతరం డౌన్‌లోడ్ చేసుకున్న మార్క్ షీటును ప్రింట్ తీసుకోండి.


www.cisce.org వెబ్‌సైట్ కాకుండా ఇతర విద్యా , ఉద్యోగ సంబంధ పోర్టల్స్‌ ద్వారా కూడా విద్యార్ధులు ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే రీచెకింగ్ కోరేవారు పేపర్‌కు రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 33 శాతం మార్కులు పొందాలి. ఉత్తీర్ణత సాధించిన వారికి కౌన్సిల్ గ్రేడ్‌లను కేటాయిస్తుంది. పాఠశాలలు తమ ప్రిన్సిపాల్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి కౌన్సిల్ కెరీర్ పోర్టల్‌లోకి లాగిన్ కావడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఏదైనా సమస్య వున్నట్లయితే CISCE హెల్ప్‌డెస్క్‌ను కానీ 18002671790 నెంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.