చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల కాల్పుల వల్ల ఒక సీఆర్ ఫీఎప్ జవాన్ చనిపోయారు. మరో జవాన్ గాయాలపాలయ్యారు. ప్రస్తుతం మవోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 

ఛత్తీస్‌గఢ్‌లోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత బీజాపూర్ (bijapur) జిల్లాలో శనివారం నక్సల్స్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారి ఒక‌రు మ‌ర‌ణించారు. మ‌రో జ‌వాన్ గాయ‌ప‌డ్డారు. సీఆర్ పీఎఫ్ 168వ బెటాలియన్ బృందం రోడ్డు భద్రతా విధుల్లో ఉన్నప్పుడు బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్‌కేల్ గ్రామానికి సమీపంలోని వాగు సమీపంలో ఉదయం 9:30 గంటలకు ఈ సంఘటన జ‌రిగింద‌ని ఐజీ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ (sundar raj) తెలిపారు. 

రాజధాని రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోని దొంగల్ చింత (dongal chintha) నది సమీపంలో పెట్రోలింగ్ బృందం అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఈ స‌మ‌యంలో మావోయిస్టుల బృందం నుంచి భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సీఆర్ పీఎఫ్ 168వ బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శాంతి భూషణ్ టిర్కీ (shanthi bhushan tirki) మృతి చెందారు. జవాన్ అప్పారావు (apparao) గాయపడ్డారు. ఘటనపై అప్రమత్తమైన వెంటనే బ‌ద్ర‌తా సిబ్బంది బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఐజీ తెలిపారు. గాయపడిన జవాన్, అమరుడైన అధికారి మృతదేహాన్ని అడవి నుండి బయటకు తరలిస్తున్నామని, సమీప ప్రాంతాల్లో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయ‌న ప్ర‌క‌టించారు. 

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు గ‌తేడాది సెప్టెంబ‌ర్ 26వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా (central home minister amith sha).. మావోయిస్టు ప్రాభావిత ప్రాంతాల ముఖ్య‌మంత్రుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో బీహార్ (bihar), ఒడిశా (odisha), మహారాష్ట్ర (maharastra), తెలంగాణ (telangana), మధ్యప్రదేశ్ (madyapradhesh), జార్ఖండ్ (jarkhand) సీఎంలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మపక్ష తీవ్రవాద సమస్యకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. దీని వ‌ల్ల ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనవ‌చ్చని చెప్పారు. అందుకు బిల్డింగ్ ప్రెజర్, వేగం పెంచడంతోపాటు మెరుగైన సమన్వయం అవసరమని చెప్పారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాదుల ఆదాయ వనరులను నిర్వీర్యం చేయడం చాలా ముఖ్య‌మ‌ని నొక్కిచెప్పిన అమిత్ షా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీలు కలిసి ఒక వ్యవస్థను రూపొందించడం ద్వారా దీనిని ఆపడానికి ప్రయత్నించాలని అన్నారు.