ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఓ జవాన్ ను కాల్చి చంపారు. కాంకేర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
రాయ్‌పూర్: Chhattisgarh రాష్ట్రంలో maoist ఓ జవాన్ ను కాల్చి చంపారు. కాంకేర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. కాంకేర్ జిల్లా అమబెడ పోలీస్ స్టేషన్ పరిధిలో jawan ను మావోయిస్టులు హతమార్చారని భద్రతా సిబ్బంది తెలిపారు. ఇదే రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు, పోలీసులకు జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ జవాన్ మరణించారు. దంతెవాడ .జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఈ ఏడాది జనవరి మాసంలో బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు.తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ,సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారు.
