RAIPUR: ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలోని ఇటుక బట్టీలో మంగళవారం రాత్రి వీపరితమైన పొగ కారణంగా ఊపిరి పీల్చడంలో ఇబ్బందికి గురై ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Five suffocate to death at brick kiln: ఇటుక బట్టీ దగ్గర వెలువడిన పొగ కారణంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలోని ఇటుక బట్టీలో మంగళవారం రాత్రి వీపరితమైన పొగ కారణంగా ఊపిరి పీల్చడంలో ఇబ్బందికి గురై ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గధ్‌ఫుల్‌ఝర్ గ్రామంలో జరిగినట్లు అధికారులు తెలిపారు.
మంగళవారం రాత్రి ఇటుక బట్టీలను వేడి చేయడానికి ఆరుగురు కార్మికులు బట్టీలో మట్టి ఇటుకలు వేసి అక్కడే పడుకున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. వీరిలో ఐదుగురు ఉదయం చనిపోయారు. పొగను పీల్చడంతో ఊపిరాడక చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు. ఇతర కార్మికులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని లేపేందుకు ప్రయత్నించారు. అయితే, వారు ఎంతకు లేవకపోవడంతో ప్రమాదం వెలుగులోకి వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఒక కార్మికుడిని ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామనీ, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే, ఈ విషాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
