bhupesh baghel : అమిత్ షా ఛాలెంజ్ ను స్వీకరించిన ఛత్తీస్‌ఘడ్ సీఎం.. చర్చకు తేదీ, వేదిక, సమయం చెప్పాలన్న బఘేల్
chhattisgarh assembly election 2023 : కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన డిబేట్ ఛాలెంట్ ను ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేశ్ బఘేల్ స్వీకరించారు. చర్చకు తేదీ, సమయం, వేదిక చెప్పాలని ప్రతి సవాల్ విసిరారు.
chhattisgarh assembly election 2023 : ఛత్తీస్‌ఘడ్ అసెంబ్లీకి నేడు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3వ తేదీన వెలువడనున్నాయి. అయితే ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుకున్న సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ డిబేట్ ఛాలెంజ్ చేశారు. దానిని తాజాగా సీఎం స్వీకరించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. భూపేశ్ బఘేల్ తమ రిపోర్టు కార్డును ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. ‘‘మీకు దమ్ముంటే గత ఐదేళ్లలో మీరు చేసిన పని గురించి, గత 15 ఏళ్లలో మోడీజీ చేసిన పనులపై మాతో చర్చకు రావాలి’’ అని సవాల్ విసిరారు.
అయితే ఈ సవాల్ ను స్వీకరించిన సీఎం బఘేల్.. ఛత్తీస్‌ఘడ్ వాసులు ఎవరికీ భయపడబోరని అన్నారు. ‘‘మీ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నాం అమిత్ షా గారూ! స్టేజ్, టైమ్, డేట్ చెప్పండి... నేను వస్తాను. 15 ఏళ్ల మీ అవినీతి, ఐదేళ్ల మా పనిపై చర్చ జరగాలి. ఛత్తీస్ ఘడీలు భయపడేది లేదు. మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం..’’ అని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ఆయన సోఫా ఫొటోను షేర్ చేశారు. అందులో ఓ పక్క అమిత్ షా పేరు, మరో పక్క భూపేశ్ బఘేల్ పేరుతో స్టిక్కర్ అతికించి ఉంది.
ఇదిలావుండగా.. ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేశ్ బఘేల్ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేశారు. తాము రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తే కుల గణన నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. షెడ్యూల్డ్ కులాలు, గిరిజన కులాలు, వెనుకబడిన తరగతులు, జనరల్ కేటగిరీ, మైనారిటీలకు జనాభా గణన చేపడుతాం అని ఆయన రాయ్ పూర్ లో ప్రకటించారు.