Asianet News TeluguAsianet News Telugu

వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8 మంది మృతి: ఐదుగురి పరిస్థితి విషమం

 ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో వైద్యం వికటించి ఎనిమిది మంది మరణించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులకు వైద్యం చేసిన డాక్టర్ పరారీలో ఉన్నాడు.

Chhattisgarh 8 Dead, 5 Hospitalised After Consuming Homeopathic Medicine, Drosera 30 in Bilaspur, Doctor Absconding lns
Author
Čhattísgarh, First Published May 6, 2021, 3:10 PM IST

 ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో వైద్యం వికటించి ఎనిమిది మంది మరణించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులకు వైద్యం చేసిన డాక్టర్ పరారీలో ఉన్నాడు.దేశీయంగా తయారు చేసిన మద్యం (91 శాతం) ఆల్కహాల్ ఉన్న హోమియోపతి మందు డ్రోసెరా 30 తీసుకొన్నారు. ఈ మందు వాడిన తర్వాత ఒకే కుటుంబంలోని 8 మంది మృత్యువాతపడ్డారు. మిగిలిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. 

రాష్ట్రంలోని బిలాస్‌పూర్ లో 12 మంది సభ్యులున్న కుటుంబం ఆల్కహాలిక్ హోమియోపతి మందును తీసుకొన్న తర్వాత  ఈ ఘటన చోటు చేసుకొందని సీఎంఓ తెలిపింది. ఈ హోమియోపతి మందులో ఆల్కహాల్ ఉన్నందున  వీరు చనిపోయి ఉంటారని సీఎంఓ తెలిపింది.  

ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు  8 మంది మరణించడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న వైద్యుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios