చెన్నై: ఈ నెల 23వ తేదీన విపక్ష పార్టీల సమావేశం లేదని డీఎంకె చీఫ్ స్టాలిన్ తేల్చి చెప్పారు.ఈ నెల 23వ తేదీన విపక్షాల సమావేశం అవసరం  లేదన్నారు.

సోమవారం నాడు స్టాలిన్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికిప్పుడు విపక్షాలు సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు.ఈ నెల 23న, సమావేశం లేనే లేదన్నారు.  

విపక్ష పార్టీలు ఈ నెల 21వ తేదీన ఢిల్లీలో  సమావేశం కావాలని  భావిస్తున్నారు. ఈ తరుణంలో  స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. మరో వైపు బీఎస్పీ చీఫ్  మాయావతి ఇవాళ ఢిల్లీలో సోనియాను కలవాల్సి ఉంది.  ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బీఎస్పీ చీఫ్ మాయావతిని కలిశారు. ఈ పరిణామాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.