ఢిల్లీలో రైతుల ఆందోళన నేపథ్యంలో రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం మరోసారి జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. గురువారం మధ్యాహ్నం నుంచి దాదాపు ఏడు గంటలకు పైగా సాగిన చర్చలు ఎలాంటి ప్రయోజనం ఇవ్వలేదు.

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబట్టారు. అయితే రైతుల మద్ధతు ధరలో ఎలాంటి మార్పులు చేయనివ్వబోమని కేంద్రం తేల్చిచెప్పింది.

ఇదే సమయంలో మద్ధతు ధరపై రాతపూర్వక హామీకి రైతు సంఘాలు పట్టుబట్టాయి. రైతుల ప్రయోజనాలు కాపాడుతామని కేంద్రం భరోసా ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఎల్లుండి మరోమారు రైతులతో చర్చలు జరపనుంది. అంతకుముందు హోంమంత్రి అమిత్ షాతో కెప్టెన్ అమరీందర్ సింగ్ సమావేశమై చర్చించారు.

పంజాబ్, హర్యానా రైతులతో ఢిల్లీ సరిహద్దులు నిండిపోయాయి. అటు గుజరాత్, రాజస్ధాన్ నుంచి కూడా రైతులు వస్తున్నారు.

మరోవైపు పద్మ విభూషణ్ అవార్డును పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ వెనక్కి ఇచ్చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని అమిత్ షాను కోరినట్లు పంజాబ్ సీఎం పేర్కొన్నారు.