Asianet News TeluguAsianet News Telugu

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక: నాలుగు శాతం డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు  మోడీ సర్కార్ దసరా కానుకను ప్రకటించింది.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతూ  నిర్ణయం తీసుకుంది.

Center announces 4 percent DA hike for government employees lns
Author
First Published Oct 18, 2023, 1:47 PM IST | Last Updated Oct 18, 2023, 2:01 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్  దసరా కానుకను ప్రకటించింది.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు  నాలుగు శాతం  డీఏను పెంపునకు కేబినెట్ బుధవారంనాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 42 నుండి 46 శాతానికి పెంపునకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడవ సెంట్రల్ పే కమిషన్  సిఫారసుల ఆధారంగా  కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. ఈ నిర్ణయం కారణంగా  సుమారు  47 లక్షల మంది  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,  68 లక్షల మంది  పెన్షన్లకు  లబ్ది కలగనుంది.

పెంచిన డీఏను  ఈ ఏడాది జూలై 1నుండి వర్తింప చేయనున్నారు. జూలై నుండి అక్టోబర్ వరకు  డీఏ బకాయిలను  చెల్లించనున్నారు. నవంబర్ నుండి  పెంచిన డీఏతో కూడిన వేతనం చెల్లించనుంది ప్రభుత్వం.  డీఏ పెంపు కోసం  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు.  ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ ఈ విషయమై  కీలక నిర్ణయం తీసుకుంది.డీఏ నాలుగు శాతం పెంపు కారణంగా  ఉద్యోగులకు ప్రతి నెల సుమారు రూ.8,280 అదనంగా లభించనుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios