Asianet News TeluguAsianet News Telugu

 కి'లేడీ' ..  ఏడో పెళ్ళి చేసుకుంటూ.. ఆరో భ‌ర్త‌కు ప‌ట్టుబ‌డ్డ నిత్య పెళ్లికూతురు

ఓ యువ‌తి డబ్బు సంపాదించాలని బ‌రితెగించింది. డ‌బ్బు ఉన్న యువ‌కులను టార్గెట్ చేసేంది.  ఇలా నిత్య పెళ్లి కూతురుగా మ‌రింది. ఆరో పెళ్లి అయిన  15 రోజుల్లోనే.. 7వ పెళ్లికి సిద్ధమైంది. సీన్ రివ‌ర్స్ కావడంతో ఆ యువ‌తి పోలీసుల‌కు ప‌ట్టుబ‌డింది.

CAUGHT RED-HANDED : 26 Year Old Woman Caught Marrying For The 7th Time !!
Author
First Published Sep 24, 2022, 2:15 AM IST

ఎలాగైనా డ‌బ్బు సంపాదించాల‌నే ఆశ‌తో ఓ యువ‌తి.. నిత్యపెళ్లికూతురు అవతారం ఎత్తింది. డ‌బ్బు ఉన్న యువ‌కుల‌ను టార్గెట్ చేయ‌డం.. పెళ్లి చేసుకుని వారి ఆస్తులు కాజేయడమే ఆమె పని. తొలుత పెళ్లిళ్ల బ్రోకర్ల ద్వారా డబ్బు ఉన్న అమాయ‌క యువ‌కుల వివ‌రాలు తెలుసుకుని వారికి ట్రాప్ చేసింది. త‌న‌ అందాలతో వారిని ముగ్గులోకి దించేంది. ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రిని పెళ్లి చేసుకుంది. ఇలా ఆ కీలేడీ ఆరు పెళ్లిళ్లు చేసుకుంది. ఆ త‌రువాత వారి ఇంట్లో చొర‌బ‌డి.. న‌గ‌లు, న‌గ‌దు చోరీ చేసేంది. ఏడో పెళ్లి చేసుకుంటుండ‌గా... ఆరో భ‌ర్త‌కు అడ్డంగా బుక్కైంది. ఈ ఘ‌ట‌న తమిళనాడు రాష్ట్రం తిరువళ్ళూరు జిల్లా చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే..నామక్కల్ జిల్లా పరమతివేలూరు పక్కన ఉన్న కల్లిపాళయం అనే గ్రామానికి చెందిన  యువ‌కుడు ధనపాల్. త‌న పెళ్లి కోసం వధువును చూడమని ఓ బ్రోకర్ కు భారీ మొత్తంలో డబ్బును స‌మ‌ర్పించుకున్నాడు.  ఆ బ్రోక‌ర్.. చాలా వెతికి.. మధురై జిల్లాకు చెందిన సంధ్య(26)తో వివాహం కుదిర్చాడు. ఆ బ్రోక‌రే ద‌గ్గ‌రుండి.. వారికి పెళ్లి జ‌రిపించాడు. అంత స‌వ్యంగానే జ‌రిగింది. పెళ్లి తర్వాత ధనపాల్ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఇలా ఉండ‌గా.. వివాహమైన‌.. ఓ రెండు వారాల‌కు ధనపాల్ కు  ఓ షాక్ తగిలింది. సంధ్య వైపు బంధువులు కొంతమంది ధ‌న‌పాల్ ఇంటికి వచ్చారు. వారితో బ‌య‌ట‌కు వెళ్లి వ‌స్తాన‌న్న సంధ్య మ‌ళ్లి తిరిగి ఇంటికి రాలేదు. 

ఇలా ఉండగా పెళ్లయిన రెండు రోజులకే ధనపాల్ కు షాక్ తగిలింది. కొత్త అమ్మాయి సంధ్య ఇంట్లో నుంచి మిస్టరీగా ఉండడమే ఇందుకు కారణం. అనంతరం ధనపాల్‌ తన భార్య సెల్‌ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేయగా అది స్విచ్ఛాఫ్‌ అయింది. అంతే కాదు హోం బీరువాలో ఉన్న నగలు, పెళ్లి చీరలు కూడా మాయమైనట్లు సమాచారం. నివేదికల ప్రకారం, సంధ్య బంధువు మరియు బ్రోకర్ నంబర్‌ను సంప్రదించిన తర్వాత కూడా, నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది.

ఈ క్ర‌మంతో ధ‌న‌పాల్ త‌న భార్య‌  మొబైల్ నెంబర్​కు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ అని వ‌చ్చింది. అలాగే.. సంధ్య త‌రుపున‌  బంధువుల నెంబర్లను ఫోన్ చేసినా ఎలాంటి  రెస్పాన్స్ రాలేదు. తీరా ఇంట్లో ఉన్న బీరువా తెరిచి చూసే స‌రికి అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. బీరువాలో ఉన్న నగలు, పెళ్లి చీరలు కూడా మాయమైనట్లు గుర్తించాడు. ధన్​పాల్​కు జ‌రిగిన మోసం  అర్థమైంది.. తాను మోసపోయానని గ్ర‌హించి ఆ యువ‌కుడు..  పారామతి వెల్లూర్ పోలీసుల‌ను ఆశ్రయించాడు. తాను మోస‌పోయాన‌ని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. 

మరోవైపు, ధన్​పాల్ సైతం.. కీలేడీ సంధ్య కోసం త‌న వంతు ప్ర‌యత్నాలు చేశారు. ఈ క్రమంలోనే పారామతి వెల్లూర్​కు సమీపంలోని ఓ పెళ్లిళ్ల బ్రోక‌ర్ వ‌ద్ద సంధ్య ఫోటో క‌నిపించింది. త‌న గురించి మెల్ల‌గా ఆరా తీశాడు. తన గురించి తెలియనీయకుండా సంధ్యను ఫోన్ లో సంప్రదించాడు. ఫైన‌ల్ గా  సెప్టెంబర్ 22న పెళ్లి చేసుకుందామని ఆమెను ఒప్పించాడు. త‌న ప్లాన్ గురించి.. పోలీసులకు తెలిపాడు. 

ధ‌న్ పాల్ ప్లాన్ ప్రకారం.. వివాహ వేదిక‌కు స‌మీపంలో మ‌ప్లీలో నిఘా పెట్టారు. కీలేడి సంధ్యతో పాటు.. త‌న ముఠా స‌భ్యుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.  క‌స్టడీలో తీసుకున్న వారిని పోలీసులు త‌మ‌దైన శైలిలో ప్రశ్నించగా.. దిమ్మ తిరిగే  విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు సంధ్య ఇప్పటికి ఆరుగురిని  మభ్యపెట్టి వివాహం చేసుకుందని తేలింది. ధన్​పాల్ ఆరో వ్యక్తి అని తెలిసింది. ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే ఈ మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు తెలిపారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. మరికొంద‌రికి కోసం పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios