కూతురితో సమానమైన కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొడుకు లేని సమయంలో... కోడలి గదిలోకి ప్రవేశించి.. తుపాకీతో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంత దారుణానికి పాల్పడింది ఓ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కావడం గమనార్హం. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. కాగా... నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ ష కీన్  కుమారుడితో... గతేడాది ఓ యువతికి వివాహమైంది. గతేడాది డిసెంబర్ 31వ తేదీ రాత్రి... యువతి తన భర్త, సోదరుడితో కలిసి పుట్టింటి నుంచి అత్తారింటికి బయలు దేరింది. ఆ రోజు డిసెంబర్ 31.. తెల్లవారితో నూతన సంవత్సరం కాబట్టి.. సదరు యువతిని ఆమె భర్త మొదట ఇంటికి కాకుండా ఓ హోటల్ కి తీసుకువెళ్లాడు.

అక్కడ స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ సంబరాలు జరుపుకున్న తర్వాత వారు అత్తారింటికి వెళ్లారు. వాళ్లు ఇంటికి చేరుకునే సరికి దాదాపు అర్థరాత్రి 12 గంటల 30 నిమిషాలు దాటింది. ఆమె భర్త స్నేహితులతో గడిపేందుకు బయటకు వెళ్లగా... సదరు యువతి తన గదిలో నిద్రించింది. ఆ సమయంలో ఆమె మామగారైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్... కోడలి గది వద్దకు వెళ్లాడు.

తనతో మాట్లాడాలని చెప్పి గది తలుపులు తీయాల్సిందిగా కోరాడు. మామగారు కావడంతో యువతి కూడా గది తలుపులు తెరచింది. ఆ సమయంలో వెంటనే గది తలుపులు మూసివేసిన మనోజ్... కోడలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తన అనుమానంగా అనిపించడంతో యువతి గట్టిగా అరవడానికి ప్రయత్నించింది. దీంతో... వెంటనే మనోజ్.. తుపాకీతో కోడలిని బెదిరించి... బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించడంతో... ఇన్ని రోజులు ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ సమయంలో... మనోజ్ మద్యం సేవించి ఉండటం గమనార్హం.

తన కాపురం కూలిపోతుందనే భావనతో మొదట యువతి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కాగా ఇటీవల మళ్లీ మనోజ్ అదేవిధంగా ప్రవర్తించాలని చూడటం... భర్తలో కూడా మార్పురావడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇటీవల గృహ హింస కేసు పెట్టిన ఆమె తాజాగా... మామపై రేప్ కేసు పెట్టింది. కాగా... ఈ ఘటన జరిగి దాదాపు ఏడు నెలలు గడుస్తుండగా... తాజాగా బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన మామ పై కేసు నమోదు చేయాల్సిందిగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.