ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చేసిన అజ్మీర్ దర్గా ఖాదీమ్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అజ్మీర్ చిస్తీ ఫౌండేష‌న్ చైర్మ‌న్ స‌య్య‌ద్ స‌ల్మాన్ చిష్టీ కోరారు. ఆయన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పారు. 

హింసాత్మ‌క పిలుపులు ఇస్లాంకు, మాన‌వ‌త్వానికి వ్య‌తిరేకం అని అజ్మీర్‌లోని చిస్తీ ఫౌండేషన్ చైర్మన్, గడ్డి నాషిన్-దర్గా అజ్మీర్ షరీఫ్ హాజీ సయ్యద్ సల్మాన్ చిష్టీ అన్నారు. ఆ నినాదాల‌ను ఆయ‌న ఖండించారు. ‘‘ మేము ఇస్లామిక్, మానవత్వ వ్యతిరేక నినాదాలను పూర్తిగా ఖండిస్తున్నాము. హింస, మరణం, విధ్వంసం నినాదాలను తీసుకువస్తున్నవారే నిజమైన దోషులు’’ అని ఆయన అన్నారు.

కర్ణాటకలో రెండు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ ‘చింత‌న్ శివిర్’.. అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో నిర్వ‌హ‌ణ‌

ఇటీవల మహ్మద్ ప్రవక్తను అవమానించడంపై మతపెద్దలు రెచ్చగొట్టే ప్రకటనలు జారీ చేసిన నేపథ్యంలో హాజీ సయ్యద్ సల్మాన్ చిస్తీ ప్రకటనలు చేశారు. గతవారం అంజుమన్ కమిటీకి చెందిన సర్వర్ చిష్టీ చేసిన ప్రసంగంలో ప్రవక్త మహిమలో అపచారం ఉంటే సహించేది లేదని పేర్కొన్నారు. అయితే బీజేపీ నుంచి బహిష్కారానికి గురైన నూపుర్ శర్మపై రెచ్చగొట్టే ప్రకటన ఇచ్చాడన్న ఆరోపణపై అజ్మీర్ దర్గా ఖాదీమ్ సల్మాన్ చిస్తీని ఒకరోజు ముందు అజ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయ‌న ఓ వీడియోలో నూపుర్ శర్మను తల నరికి చంపేవారికి తన ఇంటిని ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. 

Scroll to load tweet…

హింసాత్మ‌క నినాదాల‌ను ఖండిస్తున్న‌ట్టు, అలాగే వాటిని లేవ‌నెత్తిన వ్య‌క్తుల‌ను బ‌హిష్క‌రిస్తున్నట్టు హాజీ సయ్యద్ సల్మాన్ చిస్తీ స్ప‌ష్టం చేశారు. ‘‘ దర్గా అజ్మీర్ షరీఫ్, ఈ నినాదాలు లేవనెత్తిన కొంతమంది వ్యక్తులను బహిష్కరిస్తాము. దీనికి అజ్మీర్ దర్గా షరీఫ్ లేదా గరీబ్ నవాజ్ సంఘానికి ఎలాంటి సంబంధ‌మూ లేదని ప్రపంచం తెలుసుకోవాలి ’’ అని ఆయన అన్నారు.

ఈ నినాదాలు చేసిన వారిని చ‌ట్ట ప‌రంగా క‌ఠినంగా శిక్షించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ విష‌యాన్ని అధికార యంత్రాంగం గ‌మ‌నించాల‌ని చెప్పారు. వారికి శ్రేష్ట‌మైన శిక్ష‌లు విధించాలి. ఇది రాడికల్ భావజాలానికి సంబంధించిన సమస్య అని ఆయ‌న అన్నారు. 

మా ప్రభుత్వం పూర్తి కాలం పని చేస్తుంది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా గెలుస్తాం - మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే

కాగా అజ్మీర్ దర్గా షరీఫ్‌లోని ఖాదీమ్‌లు చేసిన ఉద్రేకపూరిత వ్యాఖ్య‌లు స్థానికంగా రెస్టారెంట్-రవాణా వ్యాపారంపై ఎంతో ప్ర‌భావం చూపింద‌ని అసోసియేట్ వార్తాపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ప‌ది శాతం ఈ వ్యాపారంలో న‌ష్టం వ‌చ్చింద‌ని తెలిపారు. శుక్రవారం అయినప్పటికీ ఇక్కడ నిశ్శబ్ద వాతావ‌ర‌ణం నెలకొంది. హోట‌ల్ రూమ్స్ ను అడ్వాన్స్ గా బుక్ చేసుకున్న అనేక మంది దానిని ర‌ద్దు చేసుకున్నారు.