Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్ లో కేబుల్ బ్రిడ్డి ప్రమాదం.. ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందకుండానే సందర్శకుల అనుమతి..

గుజరాత్ లోని కేబుల్ బ్రిడ్జి ప్రమాదంలో మృతుల సంఖ్య 132కి చేరుకుంది. అయితే ఆ వంతెన రిపేర్ పనులు చేపట్టిన కంపెనీ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకోకుండానే దానిపైకి సందర్శకులను అనుమతి ఇచ్చారు. 

Cable bridge accident in Gujarat.. Visitors allowed without getting fitness certificate..
Author
First Published Oct 31, 2022, 8:57 AM IST

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలోని మచ్చు నదిపై శతాబ్ద కాలం నాటి కేబుల్ వంతెన ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 132 మంది మరణించారు. వంతెన కూలిపోయినప్పుడు దానిపై వందల మంది ఉన్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

ఈ పురాతన వంతెనను పునరుద్దరించడానికి ఒరేవా అనే ప్రైవేట్ ట్రస్ట్ ప్రభుత్వం నుండి టెండర్ తీసుకుంది. మరమ్మతుల కోసం ఏడు నెలల పాటు వంతెనను మూసి ఉంచారు. అయితే గత వారమే ఆ వంతెన మరమ్మతుల పనులు పూర్తి అయ్యాయని ‘ఎన్టీటీవీ’ నివేదించింది. 

దారుణం.. యూట్యూబ్ లో చేతబడి వీడియోలు చూసి.. ఏడేళ్ల చిన్నారి నరబలి...!

అక్టోబర్ 26న వంతెనను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అయితే బ్రిడ్జిని తెరవడానికి ముందు కంపెనీ అధికారుల నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోలేదని మోర్బీ మున్సిపల్ ఏజెన్సీ చీఫ్ సందీప్‌సిన్హ్ జాలా పేర్కొన్నారు.  ‘‘ ఇది ప్రభుత్వ టెండర్. బ్రిడ్జిని ప్రారంభించే ముందు ఒరెవా గ్రూప్ దాని పునరుద్ధరణ వివరాలను అందించాలి. క్వాలిటీ టెస్ట్ చేయించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ప్రభుత్వానికి ఈ విషయం గురించి తెలియదు ’’ అని సందీప్ సిన్హ్ జాలా తెలిపారు.

నిన్న విడుదలైన ఒక వీడియోలో చాలా మంది వంతెనపై దూకడం, పరిగెత్తడం కనిపించింది. వారు అలా కదులుతున్నప్పుడే కేబుల్ వంతెన ఊగుతూ కనిపించింది.  ఈ ఘటనపై రాష్ట్ర, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బ్రిజేష్ మెర్జా మాట్లాడుతూ.. ‘‘గత వారం ఈ వంతెన్ రిపేరింగ్ పూర్తి అయ్యింది. ఈ ప్రమాదంపై మేము కూడా ఆశ్చర్యపోయాము. మేమే ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాం ’’ అని ఆయన తెలిపారని ‘ఎన్డీటీవీ’ నివేదించింది.

సోదరుడితో భార్య వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, వారిద్దరికీ పెళ్లి చేసిన భర్త...

ఇదిలా ఉండగా.. ఘటన జరిగిన తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మోర్బీకి చేరుకుని సహాయక చర్యలు,  వైద్య సేవలను స్వయంగా పర్యవేక్షించారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. సహాయక చర్యలు ముగిసే వరకు ముఖ్యమంత్రి మోర్బీలో క్యాంపు ఉండే అవకాశం ఉంది. మోర్బిలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారాన్ని కూడా ప్రధాని మోడీ ప్రకటించారు. గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి కూడా మోర్బీలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని.. ఈరోజు రేంజ్ ఐజీపీ నేతృత్వంలో విచారణ ప్రారంభించామని తెలిపారు.

ఈ సమస్య జాతీయ భద్రత,ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.. చైనా రుణ యాప్ లపై కేంద్రం ఫైర్

క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారిలో చాలా మందిని చికిత్స అనంతరం వారి ఇళ్లకు కూడా పంపించామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. "గాయపడినవారు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మంది చికిత్స తర్వాత వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో ఇంకా మరణించిన లేదా గాయపడిన వారికోసం వెతుకులాట, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. నది నుండి మృతదేహాలను బయటకు తీసే పని ఇంకా కొనసాగుతోంది" అని పటేల్ చెప్పారు. ఇదిలా ఉండగా.. నేడు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరగాల్సిన రోడ్ షోను ప్రధాని రద్దు చేసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios