తెలంగాణ సీఎం కేసీఆర్ కి.. డీఎంకే అధినేత స్టాలిన్ ఊహించని షాక్ ఇచ్చారు. 


తెలంగాణ సీఎం కేసీఆర్ కి.. డీఎంకే అధినేత స్టాలిన్ ఊహించని షాక్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల పర్యటనలో భాగంగా... సీఎం కేసీఆర్... స్టాలిన్ తో భేటీ అవుదామని అనుకున్నారు. కాగా... ఆ భేటీ ఇప్పుడు కుదరకపోవచ్చనే సమాధానం వినపడుతోంది. తమిళనాడులో ఈనెల 19న జరగనున్న నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్‌ బిజీగా ఉన్నందున కేసీఆర్‌తో సమావేశం కుదరకపోవచ్చని డీఎంకే వర్గాలు తెలిపాయి.

చెన్నైలో ఈ నెల 13న స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ అవుతారని తెలంగాణ సీఎంఓ ఇంతకుముందు తెలిపింది. దేశ రాజకీయాలు, లోక్‌సభ ఎన్నికల అనంతరం పరిణామాలు, కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు తదితర అంశాలపై స్టాలిన్‌తో కేసీఆర్‌ చర్చిస్తారని పేర్కొంది. కాగా... డీఎంకే వర్గాలు చెబుతున్న వివరాలను చూస్తుంటే.. భేటీ జరగడం కష్టమేనని తెలుస్తోంది.