Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరు ట్రాఫిక్‌లో ఇరుక్కున్న బస్సు.. భోజనం చేసేసిన డ్రైవర్.. వీడియో వైరల్

బెంగళూరులో ట్రాఫిక్ జామ్ గురించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. బస్సు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోవడంతో డ్రైవర్ భోజనం చేసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 

bus driver had lunch while bus stuck in bengaluru traffic jam kms
Author
First Published May 29, 2023, 8:09 PM IST

బెంగళూరు: సోషల్ మీడియాలో ట్రాఫిక్ పై ఎక్కువ చర్చ కర్ణాటక రాజధాని బెంగళూరు గురించే ఉంటుంది. స్టార్టప్ హబ్ అని పేరున్న బెంగళూరుకు.. ట్రాఫిక్ జామ్‌ల సిటీ అని పేరు వచ్చేలా ఉన్నది. ఇప్పటికే ట్రాఫిక్ గురించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కోవలోకే వచ్చే ఓ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నది.

ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సాయి చంద్ బయ్యవరపు ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోకు 1.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. బెంగళూరు ట్రాఫిక్‌లో ఓ చాలా వాహనాలు ఇరుక్కుపోయి ఉన్నాయి. అందులో ఓ బస్సు కూడా ఉన్నది. అయితే, ఆ బస్సు డ్రైవర్ ట్రాఫిక్‌ను అంచనా వేశాడు. ఇప్పట్లో ఈ ట్రాఫిక్ ఫ్రీ కాబోదని భావించాడు. వెంటనే లంచ్ బాక్స్ తీశాడు. చకచకా భోజనం చేసేశాడు. ఆ తర్వాత వాటర్ తాగాడు. ఇదంతా బస్సు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కాలంలోనే చేసేశాడు. ఇదంతా ఆ వైరల్ వీడియోలో కనిపించింది. 

ఈ వీడియోకు క్యాప్షన్‌గా బెంగళూరులో ట్రాఫిక్ పరాకాష్టకు చేరిన సమయంలో ఉండే స్థితి ఇది అంటూ పేర్కొన్నారు. ఈ ఘటన సిల్క్ బోర్డ్ జంక్షన్ ట్రాఫిక్ జామ్‌లో చోటుచేసుకున్నట్టు వీడియోలో రాశారు.

Also Read: Asianet News Dialogues: భూమి చుట్టూ సముద్రయానం చేసిన అభిలాష్ టామీ.. 30 వేల మైళ్ల జర్నీ గురించి ముఖ్యాంశాలు

ఈ వీడియోపై కామెంట్లు కూడా కుప్పలు తెప్పలుగా వచ్చాయి. కొందరేమో ఆ బస్సు డ్రైవర్ పరిస్థితిపై జాలిపడ్డారు. ట్రాఫిక్‌లో ఆలస్యం కావడం వల్ల ఆ డ్రైవర్ తినడానికీ సమయం దొరకడం లేదేమో అని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు డయాబెటిస్ వంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు సమయానికి భోజనం చేయడం చాలా అవసరం అని వివరించారు. మరికొందరు బెంగళూరు ట్రాఫిక్ గురించి కామెంట్లు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios