Budget session: దేశంలో క‌రోనా ప్ర‌భావం కొన‌సాగుతున్న‌ది. అయితే, ఈ నెలాఖ‌రు నుంచి నుంచి పార్ల‌మెంట్ స‌మాదేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టికే 800 మందికి పైగా పార్ల‌మెంట్ సిబ్బంది క‌రోనా బారిన‌ప‌డ‌టం, ప‌లువురు ఎంపీలు సైతం క‌రోనా పాజిటివ్ గా ప‌రీక్షించ‌డంతో ఈ సారి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు..  గత ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో అనుసరించిన ప్రోటోకాల్‌ల మాదిరిగానే నిర్వ‌హించ‌నున్నామ‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఉభ‌య స‌భ‌లు ఒక‌రోజులో రెండు వేర్వేరు షిప్టుల‌లో ప‌నిచేస్తాయ‌ని తెలిపాయి.   

Budget session: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి (Covid-19) విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. నిత్యం ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. ప్ర‌మాద‌క‌ర‌మైన ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతున్న‌ది. అయితే, గ‌త రెండు వారాలుగా అధిక సంఖ్య‌లో పార్ల‌మెంట్ సిబ్బంది క‌రోనా బారిన‌ప‌డ‌టం క‌ల‌కలం రేపుతున్న‌ది. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ప్రభావం పార్లెమెంట్ స‌మావేశాల (Parliament Budget session 2022) పై ప‌డే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ నెలాఖ‌రు నుంచి నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టికే 800 మందికి పైగా పార్ల‌మెంట్ సిబ్బంది క‌రోనా (Covid-19) బారిన‌ప‌డ‌టం, ప‌లువురు ఎంపీలు సైతం క‌రోనా పాజిటివ్ గా ప‌రీక్షించ‌డంతో ఈ సారి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ((Parliament Budget session 2022)).. గత ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Budget session) సమయంలో అనుసరించిన ప్రోటోకాల్‌ను అనుస‌రించి నిర్వ‌హించ‌నున్నామ‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఉభ‌య స‌భ‌లు ఒక‌రోజులో రెండు వేర్వేరు షిప్టుల‌లో ప‌నిచేస్తాయ‌ని తెలిపాయి. 

పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో (Parliament Budget session 2022) భాగంగా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లు ఒకే రోజు రెండు వేర్వేరు షిప్టుల్లో ప‌నిచేస్తాయ‌ని పార్ల‌మెంట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రాజ్య‌స‌భ‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లేదా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశమవుతుందని తెలిపాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ సమావేశమవుతుంది. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం కొన‌సాగుతున్న న‌నేప‌థ్యంలో పార్ల‌మెంట్ నిర్వ‌హ‌ణ వ‌ర్గాలు ఈ నిర్ణ‌యం తీసుకున్నాయి. జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో అనుసరించిన ప్రోటోకాల్‌ల మాదిరిగానే అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. సెప్టెంబరు 2020లో జరిగిన పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల నేప‌థ్యంలో తొలిసారిగా పార్లమెంటరీ కార్యకలాపాలు కఠినమైన కోవిడ్-19 ప్రోటోకాల్ చ‌ర్య‌లు తీసుకున్నారు. రోజు ప్రథమార్థంలో రాజ్యసభ, ద్వితీయార్థంలో లోక్‌సభ సమావేశమయ్యాయి. సామాజిక దూరాన్ని పాటిస్తూ.. సభ్యులు రెండు ఛాంబర్లలో కూర్చున్నారు. 

అదేవిధంగా ఈసారి కూడా (Parliament Budget session 2022) ఎగువసభ ఉదయం, లోక్‌సభ మధ్యాహ్నం సమావేశమవుతాయని లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజున, చట్టసభ సభ్యులు సెంట్రల్ హాల్, లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్‌లలో కూర్చుంటార‌నీ, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేయ‌నున్నారని వెల్లడించాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ (Union Budget) ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (union finance minister nirmala sitharaman) స‌మ‌ర్పించనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లేదా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశమవుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ సమావేశం కానుంది.