నేడు ఎగువ సభలో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇందులో చర్చకు వచ్చే విషయాలను ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దాని కోసం బీజేపీ ఎంపీలను సభకు హాజరయ్యేలా చూసుకుంటోంది. ఈ మేరకు బీజేపీ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేసింది. సభకు ఎంపీలు హాజరై ప్రభుత్వ వైఖరికి మద్దతు తెలపాలని పేర్కొంది.
నేడు రాజ్యసభలో కీలక అంశాలపై చర్చ జరగనుంది. నేడు పలు అంశాలను పెద్దల సభలో ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం (central government) భావిస్తోంది. దీని కోసం మంగళవారం (ఫిబ్రవరి 8వ తేదీ)న తప్పకుండా ఎగువసభకు హాజరుకావాలని తన ఎంపీలను బీజేపీ కోరింది. ఈ మేరకు తన రాజ్యసభ (rajyasabha) ఎంపీలకు విప్ జారీ చేసింది. రాజ్యసభలో నేడు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చర్చకు తీసుకొస్తామని తమ సభ్యులకు తెలిపింది.
‘‘ ఫిబ్రవరి 8, 2022 మంగళవారం నాడు రాజ్యసభలో చాలా ముఖ్యమైన వ్యవహారాలపై చర్చను చేపట్టి ఆమోదించనున్నాం. ఈ విషయాన్ని ఎంపీలంతా గమనించాలి. తప్పకుండా సభకు హాజరుకావాలి.’’ అని పెద్దల సభ ఎంపీలను ఉద్దేశించి బీజేపీ (bharathiya janatha party - bjp) అధికార ప్రకటన విడుదల చేసింది. ‘‘ రాజ్యసభలోని బీజేపీ సభ్యులందరూ నేడు రోజంతా సభలో అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ విధానాల పట్ల సానుకూలంగా ఉండి, ప్రభుత్వ వైఖరికి మద్దతు ఇవ్వాలి ’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.
రెండు దశల్లో జరిగే బడ్జెట్ సెషన్ (budget session) 2022 జనవరి 31న ప్రారంభమైంది. మొదటి దశ ఫిబ్రవరి 11న ముగియనుంది. రెండో దశ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగుతుంది. జనవరి 31న లోక్‌సభ, రాజ్యసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (president ramnath kovind) చేసిన ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ఫిబ్రవరి 7న ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తూ.. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచానికి నాయకత్వ పాత్రను ఎలా పోషించగలదో ఆలోచించడానికి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ (ajadi ka amruth mahosthav) సరైన సమయం అని తెలిపారు. ప్రజాస్వామ్యం ప్రాముఖ్యతను వివరించారు. భారతదేశ శతాబ్దాల నాటి ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని తెలియజేశారు.
ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (central finance minister nirmala sitharaman) పార్లమెంట్ (parliament)లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ (budget) ను ప్రవేశ పెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం రూ. 39 లక్షల 45 వేల కోట్ల అంచనాలతో వార్షిక బడ్జెట్‌ను లోక్ సభ (lokh sabha) ముందు ఉంచారు. ఈ సారి బడ్జెట్ లో మౌలిక సదుపాయాల వ్యయంపై అత్యధిక దృష్టి పెట్టారు. బడ్జెట్‌లో ద్రవ్య లోటు అంచనా 6.4 శాతంగా ఉందని ప్రకటించారు. 2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా వెళ్లడించారు. 2022-23 ఆదాయ వనరులు రూ.22.84 లక్షల కోట్లుగా ఉన్నాయని చెప్పారు. వీటిలో రక్షణ రంగం (defence sector) - రూ. 5.25 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. రైల్వే (railway) కోసం రూ. 1,40,367 కోట్లు, గ్రామీణభివృద్ది శాఖ (rural devolpment department) కు రూ. 1,38,203 కోట్లు, కమ్యూనికేషన్ (communication) కోసం రూ. 1,05,406 కోట్లు, రసాయనాలు, ఎరువులు (Chemicals, fertilizers) కోసం రూ. 1,07,715 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు.
