శిష్యులపై బౌద్ధ సన్యాసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతర్జాతీయ బౌద్ధమత కేంద్రం బిహార్‌లోని బుద్థగయలో ప్రసన్న జ్యోతి బుద్ధిస్ట్ స్కూల్ అండ్ మెడిటేషన్ సెంటర్ పేరుతో మస్తీపూర్ గ్రామంలో బౌద్ధమఠం నిర్వహిస్తున్నారు.
శిష్యులపై బౌద్ధ సన్యాసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతర్జాతీయ బౌద్ధమత కేంద్రం బిహార్‌లోని బుద్థగయలో ప్రసన్న జ్యోతి బుద్ధిస్ట్ స్కూల్ అండ్ మెడిటేషన్ సెంటర్ పేరుతో మస్తీపూర్ గ్రామంలో బౌద్ధమఠం నిర్వహిస్తున్నారు. ఇందులో 15 మంది బాలురు విద్యనభ్యసిస్తున్నారు.
ఈ క్రమంలో ఓ బౌద్ధ సన్యాసి బాలరును లైంగికంగా వేధించడంతో పాటు.. అసభ్య పదజాలంతో దూషించినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు సన్యాసిని అదుపులోకి తీసుకున్నారు.
15 మంది చిన్నారులను రేపు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి వారిచ్చే వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. దీనికి ముందే బాలురకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 15 మంది బాలురు అసోంలోని కార్బి ఆంగ్లోంగ్ జిల్లాకు చెందినవారు.
