Asianet News TeluguAsianet News Telugu

బంగారం గుట్టుర‌ట్టు.. సీక్రెట్ గా 23కేజీల గోల్డ్ స్మగ్లింగ్.. ఒకే నెలలోనే 121 కిలోలు ప‌ట్టివేత  

బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల​ నుంచి భారత్​లోకి అక్రమంగా తరలిస్తున్న రూ.11.65 కోట్ల విలువైన 23.23 కిలోల బంగారాన్ని డైరక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటిలిజెన్స్​(డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగుర్ని అరెస్ట్​ చేశారు.
 

BSF recovered 4 packets of heroin from the border In Amritsar eastern borders,
Author
First Published Oct 5, 2022, 11:44 PM IST

అక్రమంగా తరలిస్తున్న బంగారంపై డైర‌క్ట‌రేట్ ఆఫ్ రెవ‌న్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) పంజా విసిరింది. బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.11.65 కోట్ల విలువైన 23.23 కిలోల బంగారాన్ని బుధ‌వారం డీఆర్‌ఐ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో నలుగుర్ని అరెస్ట్​ చేశారు. 

వివరాల్లోకెళ్తే.. బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల నుంచి అక్రమంగా బంగారం త‌ర‌లిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు గత నెల 28-29న డీఆర్​ఐ అధికారులు సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టారు. ఈ క్ర‌మంలో శిలిగుడి- గువాహటి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఈ క్ర‌మంలో అనుమానంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులను, వారి నుంచి రెండు వాహనాల‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిని, వారి వాహనాలను ఆపి రెండు రోజుల పాటు తనిఖీలు చేపట్టారు. అయినప్ప‌టికీ.. ఎలాంటి ఆధారాలు దొర‌క‌లేదు. కానీ..ఎదో అనుమానం.. తీరా వాహనం లోపలి భాగాన్ని విప్పి చూస్తే.. అస‌లు బండారం బ‌య‌ట ప‌డింది. వాహ‌నాల అంత‌ర్బాగాల్లో 23.23 కిలోల బంగారాన్ని 21 భాగాలు చేసి దాచినట్లు అధికారులు గుర్తించారు.

డీఆర్​ఐ అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మయన్మార్ నుంచి భారత్‌కు రెండు వాహనాల్లో  అక్ర‌మంగా తీసుక‌వస్తున్న 23.23 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర రూ.11.65 కోట్లుగా చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. మొత్తంగా.. సెప్టెంబర్ నెలలో ఈశాన్య స‌రిహ‌ద్దులో 121 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సెప్టెంబర్ నెల‌లో 11 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

డీఆర్ఐ అందిన సమాచారం ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో.. 833 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దీని ఖరీదు 405 కోట్లకు పై మాటే. ఇండో-బంగ్లాదేశ్, ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో బంగారం స్మగ్లింగ్ పెరిగింది. అయితే స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.

పాక్​ సరిహద్దులో హెరాయిన్​ ప‌ట్టివేత 

పంజాబ్​లోని అమృత్​సర్​ సరిహద్దులో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న నాలుగు హెరాయిన్​ ప్యాకెట్లను బీఎస్​ఎఫ్ అధికారులు​ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 9 మి.మీ 50 లైవ్​ క్యాట్రిడ్జ్​లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్​ వైపు నుంచి  దుండగులు ఈ హెరాయిన్​ ప్యాకెట్లను విసిరారని బీఎస్​ఎఫ్ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios