Asianet News TeluguAsianet News Telugu

మందేసి, చిందేసి రచ్చ చేసిన వరుడు.. ఊహించని ట్విస్ట్ తో షాకిచ్చిన వధువు...!!

పెళ్లి అంటే ఇద్దరు మనుషులు కలిసి చేసే జీవితప్రయాణం. దీనికి నమ్మకం, విశ్వాసాలే పునాదులు. అలాంటిది ఓ వరుడు పెళ్లికాకముందే రచ్చరచ్చ చేశాడు. దీంతో తట్టుకోలేక వధువు పెళ్లి వద్దుపొమ్మంది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

bride calls off wedding after groom and his friends turn up drunk - bsb
Author
Hyderabad, First Published Jun 7, 2021, 3:18 PM IST

పెళ్లి అంటే ఇద్దరు మనుషులు కలిసి చేసే జీవితప్రయాణం. దీనికి నమ్మకం, విశ్వాసాలే పునాదులు. అలాంటిది ఓ వరుడు పెళ్లికాకముందే రచ్చరచ్చ చేశాడు. దీంతో తట్టుకోలేక వధువు పెళ్లి వద్దుపొమ్మంది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

ఓ వరుడు, అతని స్నేహితులు పెళ్లి వేదిక వద్దకు తాగి రావడంతో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)లో ఓ 22 యేళ్ల యువతి పెళ్లికి నిరాకరించింది. వివాహా నిశ్చయానికి ముందు ఇచ్చిన బహుమతులు తిరిగి ఇవ్వడానికి అంగీకరించే వరకు వధువు కుటుంబం వరుడి తరఫు వాళ్లని బందీగా ఉంచింది. దీంతో పెలలి కొడుకు కుటుంబం పోలీసులను పిలిచి సమస్యను పరిష్కరించమని అభ్యర్థించింది. తిక్రీ గ్రామంలోని ఒక రైతు తన కుమార్తె వివాహాన్ని రవీంద్ర పటేల్ అనే వ్యక్తితో ఏర్పాటు చేశాడు.

టీనేజ్ కుర్రాడిపై వివాహిత అత్యాచారం.. ఆమె భర్తకు తెలియడంతో.....

అయితే పెళ్లి రోజున వరుడు, అతని స్నేహితులు కొందరు తాగి పెళ్లి మండపం వద్దకు వచ్చారు. వధువు, ఆమె కుటుంబం పెళ్లి కొడుకు, అతని స్నేహితులు చేసే చేష్టలకు చాలాసార్లు హెచ్చరించారు. అయితే పెళ్లికి కొద్ది నిమిషాల ముందు వరుడు, వధువును డ్యాన్స్ చేయమని బలవంతం చేయడంతో పరిస్థితి మలుపు తిరిగింది. 

పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడానికి నిరాకరించింది. అయితే వరుడు విసిగెత్తి, బీభత్సం సృష్టించాడు. దీంతో అతని ప్రవర్తనకు విసిగెత్తిన వధువు పెళ్లికి నిరాకరించింది. అయితే ఈ విషయాన్ని పరిష్కరించడానికి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక చివరకు వరుడి కుటుంబం పెళ్లికి ముందు తీసుకున్న నగదు, ఇతర వస్తువులను పెళ్లి కుమార్తె కుటుంబానికి తిరిగి ఇవ్వడానికి అంగీకరించడంతో సమస్య పరిష్కారమయ్యింది. కాకపోతే పెళ్లి మాత్రం ఆగిపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios