మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. కరోనా పాజిటివ్ గా ఉండగానే ఆయన బ్రెయిన్ లో ఒక ప్రమాదకర క్లాట్ ని గుర్తించిన వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ విజయవంతమయినప్పటికీ... ఆయన వెంటిలేటర్ మీదనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన మరణించారు. 

11వ తేదీ నాడు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి ఆయన హెల్త్ బులెటిన్ ని విడుదల చేసింది. ఆయనకు సర్జరీ చేసినప్పటికీ... ఆరోగ్యం క్షీణించే ఉందని వారు ప్రకటించారు. ఆ తరువాత కూడా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. 

ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి 13వ రాష్ట్రపతిగా 2012 నుంచి 2017 వరకు సేవలందించారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యే ముందు ఆయన 2009 నుంచి 2012 వరకు ఆర్ధిక మంత్రిగా సేవలందించారు. 2019లో ఆయన కు భారత రత్న ఇచ్చి దేశం గౌరవించింది. 

ఆయన ఆసుపత్రిలో చేరే ముందు, తనకు కరోనా వైరస్ సోకిందని, గత రెండు వారాలుగా తనను కలిసిన వారంతా క్వారంటైన్ అవ్వాలనిఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆయన 2015లో తన భార్యను కోల్పోయారు.