Asianet News TeluguAsianet News Telugu

బైకాట్ మేక్ మై ట్రిప్, గోఐబిబో... సోషల్ మీడియాలో ట్రెండింగ్ 

ట్రావెలింగ్ వెబ్ సైట్స్ పై భారతదేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. విదేశీ ట్రావెలింగ్ సంస్థలు సున్నితమైన ఢాటాను సేకరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Boycott MakeMyTrip and Uninstall Goibibo trends on Social Media AKP
Author
First Published Apr 4, 2024, 8:59 AM IST

హైదరాబాద్ : ప్రముఖ ట్రావెలింగ్ సంస్థలు మేక్ మై ట్రిప్, గోఐబిబో లు ప్రజాగ్రహానికి గురవుతున్నాయి. ఈ ట్రావెలింగ్ వెబ్ సైట్స్ ను బైకాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎక్స్(ట్విట్టర్) లో మైక్ మై ట్రిప్ బైకాట్ చేయాలని,  గోఐబిబోను అన్ ఇన్స్టాల్ చేయాలన్న హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ రెండు సంస్థలపై నెటిజన్లు చాలా సీరియస్ గా వున్నారు. 

బుధవారం ఉదయంనుండి  BoycottMakeMyTrip , UninstallGoibibo హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ వెబ్ సైట్స్ వినియోగదారుల భద్రత విషయంలో చాలా  అలసత్వంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. కస్టమర్స్ ప్రైవేట్ డాటాకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వ్యవహారం డిల్లీ హైకోర్టుకు చేరింది. కేంద్ర ప్రభుత్వం ట్రావెల్ బిజినెస్ సంస్థలకు కఠిన నిబంధనలు అమలుచేయాలని... కస్టమర్స్ డాటా తప్పుదారి పట్టకుండా చూడాలని  కోరుతున్నారు. ఈ మేరకు డిల్లీ కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ లిటికేషన్ (పిల్) దాఖలయ్యింది.  అయితే  ఈ ఫిల్ ను కోర్టు కొట్టివేసింది. ఈ విషయంపై నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాల్సిందిగా కోర్టు సూచించింది. 

 

బిజెపి నేత, ప్రముఖ లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఈ ఫిల్ ను దాఖలుచేసారు. విదేశీ ట్రావెల్ ఏజన్సీస్ కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని... ఇందులో రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధినేతలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మిలిటరీ ఉన్నతాధికారులు, ఐఎఎస్, ఐపిఎస్ లతో పాటు సామాన్యులు కూడా వున్నారన్నారు. ముఖ్యంగా చైనా చేతికి ఈ డాటా చేరుతోందని... ఇది దేశ భద్రతకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసారు. కాబట్టి ట్రావెల్స్ సంస్థలను నియంత్రణ అవసరమని... ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios