UK PM Boris Johnson : కరోనా లాక్‌డౌన్‌ సమయం లో అనుమ‌తుల్లేకుండా నిర్వహించిన పార్టీకి హాజరైనందుకు పార్ల‌మెంట్ లో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ క్షమాపణలు చెప్పారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి పార్టీలో పాల్గొన్నందుకు పోలీసులు ఆయనకు జాన్సన్ కు 50 పౌండ్లు ($66) జరిమానా విధించారు. అధికారంలో ఉంటూ చట్టాన్ని ఉల్లంఘించిన తొలి ప్రధానిగా ఆయన చరిత్రకెక్కారు.   

UK PM Boris Johnson : ప్ర‌పంచ దేశాల్లో మ‌రోసారి కరోనా మహమ్మారి విభృంభిస్తోంది. మ‌నవాళికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్ప‌టికే ప‌లు దేశాలు క‌రోనా నివార‌ణ‌కు ఆంక్ష‌లు విధించాయి. ఈ నిబంధ‌నల కార‌ణంగా.. ఆర్థిక పరిస్థితులు తలకిందులు అవుతున్నా.. ప్ర‌జా ఆరోగ్యానికి పెద్ద‌పీట వేస్తూ.. ప‌లు దేశాలు కఠిన ఆంక్షలను పాటిస్తున్నాయి. ఈ క్రమంలో చిన్న‌, పెద్ద తేడా లేకుండా అంద‌రికి ఒకేలా వ‌ర్తించేలా లాక్ డౌన్ నిబంధలను క‌ఠినంగా అమ‌లు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ నిబంధలను క‌ఠినంగా అమలు చేసే.. దేశాల‌ కోవ‌కు చెందిన‌దే బ్రిట‌న్ కూడా.. లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంగించార‌నే ఏకంగా ప్ర‌ధాన మంత్రికే జ‌రిమానా విధించారు అక్క‌డి పోలీసులు. 

వివరాల్లోకెళ్తే.. క‌రోనా లాక్‌డౌన్‌ సమయంలో అనుమ‌తుల్లేకుండా ప్రధాని అధికార నివాసమైన 10-డౌనింగ్‌ స్ట్రీట్‌ భవనంలో బోరిస్‌ జాన్సన్‌ బ‌ర్త్ డే పార్టీ ఏర్పాటు చేశార‌నీ, ఈ పార్టీకి హాజరైనందుకు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్ కు 50 పౌండ్లు ($66) జరిమానా విధించారు. అధికారంలో ఉంటూ చట్టాన్ని ఉల్లంఘించిన తొలి ప్రధానిగా ఆయన చరిత్రకెక్కారు. ప్రభుత్వ భవనాల్లో జరిగిన మరికొన్ని పార్టీలకు కూడా ఆయన హాజరయ్యార‌నే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ‘పార్టీ గేట్‌’ ఉదంతమంటూ పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి.

కోవిడ్ నిబంధ‌న‌లు అమ‌లులో ఉండగా.. అత్యున్న‌త ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి ఇలాంటి పార్టీల‌కు ఎలా హ‌జ‌ర‌వుతార‌ని ప్ర‌తిప‌క్షాలు విరుచుకుప‌డ్డాయి. అంతేకాదు.. సొంత పార్టీలోని నేతలు కూడా ఆయన్ను రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. తొలుత డౌనింగ్ స్ట్రీట్‌లో జ‌రిగిన బర్త్ డే పార్టీలో తాను పాల్గొన‌లేద‌ని ప్ర‌ధాని జాన్స‌న్ మొద‌టిసారిగా వాదించారు.ప్రతిపక్షాల నుంచి, పార్టీ నేతల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో తాను కోవిడ్ రూల్స్ ఉల్లంఘించిన‌ట్టు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో పార్ల‌మెంట్ వేదిక‌గా జాన్సన్ జాతి ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు తెలియజేశారు.

బ్రిటన్ ప్రజలకు ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ క్షమాపణలు చెప్పారు. ప్రజలకు సూచించాల్సిన తానే కరోనా లాక్ డౌన్ నిబంధలను ఉల్లంఘించి పెద్ద తప్పు చేశానంటూ, అందుకు తనను క్షమించాలని బోరిస్‌ జాన్సన్ ప్రజలను కోరారు. కరోనా స‌మ‌యంలో ప్ర‌భుత్వం ప‌క్షాన బర్త్ డే పార్టీ ఇవ్వ‌డం ఎంతమాత్రం స‌రైన విధానం కాద‌ని, అందుకే తాను మ‌న‌స్ఫూర్తిగా క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని జాన్స‌న్ తెలిపారు. చట్టవిరుద్ధమైన పార్టీకి హాజరైనందుకు బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మంగళవారం హృదయ పూర్వ‌కంగా క్షమాపణలు తెలియ‌జేశారు. అయితే తాను ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘించలేదని లేదా పార్లమెంటును తప్పుదారి పట్టించలేదని అన్నారు. పార్టీలో పాల్గొన‌డం నా తప్పు. ఇందుకు నిస్సందేహంగా క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. అయితే.. పార్ట‌మెంట్ ను లేదా సభను తప్పుదోవ పట్టించార‌నే అభియోగాల‌పై జాన్సన్‌ను కమిటీకి సూచించాలా? వద్దా? అనే దానిపై చట్టసభ సభ్యులు గురువారం కామన్స్‌లో ఓటు వేయనున్నారు.

ఇంతలో, బ్రిటన్ యొక్క పాలక కన్జర్వేటివ్ పార్టీలో సీనియర్ శాసనసభ్యుడు మార్క్ హార్పర్.. జాన్సన్‌ను రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. జాన్సన్ ఉన్న‌త‌ పదవిలో కొన‌సాగ‌డానికి అర్హుడని విమ‌ర్శించారు. అలాగే.. పార్టీ క్రమశిక్షణను కొనసాగించడంలో సహాయపడిన మాజీ చీఫ్ విప్ హార్పర్, తన స్వంత కోవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులచే జరిమానా విధించిన తర్వాత అతను నిష్క్రమించాల్సిన అవసరం ఉందని జాన్సన్‌తో ఛాంబర్‌లో చెప్పాడు. హార్పర్ కూడా ప్రధానిపై అవిశ్వాస లేఖను సమర్పించారు.