ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో గురువారం నాడు ఉదయం బాంబు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో పలువురు లాయర్లు గాయపడ్డారు. కోర్టు ఆవరణలోనే మూడు బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

తమకు రక్షణ కల్పించాలని న్యాయవాదులు కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. తనను లక్ష్యంగా చేసుకొని ఈ బాంబు దాడి జరిగిందని  లక్నో బార్ అసోసియేషన్  సహాయ కార్యదర్శి సంజీవ్ లోధి అభిప్రాయపడ్డారు. బాంబు పేలుడు యూపీ విధానసభకు కిలోమీటరు దూరంలో చోటు చేసుకొంది