బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా సేఫ్.. ఇజ్రాయెల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న హీరోయిన్..
ఇజ్రాయిల్ లో తప్పిపోయిన బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా ఆచూకీ లభించింది. ఆమెను టీమ్ ఎట్టకేలకు సంప్రదించగలిగింది. తరువాత టీమ్ ద్వారా హీరోయిన్ అక్కడి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మరి కొన్ని గంటల్లో భారత్ కు రానున్నారు.

ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయి, తన టీమ్ తో సంబంధాలు కోల్పోయిన బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా సురక్షితంగా ఉన్నారు. ఎట్టకేలకు ఆమెను టీమ్ సంప్రదించగలిగింది. హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆమె ఇటీవల ఇజ్రాయెల్ వెళ్లారు. అయితే ఆ దేశానికీ, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ కు మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఆమె తప్పిపోయింది. ఆమె టీమ్ తో కూడా కమ్యూనికేషన్ తెగిపోవడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఆమెను కనిబెట్టేందుకు టీమ్ తీవ్రంగా ప్రయత్నించింది. చివరికి కమ్యూనికేషన్ జరగడంతో ఆమె ఇప్పుడు ఇజ్రాయెల్ ఎయిర్ పోర్టుకు చేరుకుననారు. అయితే డైరెక్ట్ గా ఇండియాకు విమాన సర్వీసు అందుబాటులో లేకపోవడంతో కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా స్వదేశానికి చేరుకోనున్నారు. మరి కొన్ని గంటల్లోనే ఆమె భారత్ కు తిరిగి రానున్నారు.
హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పాల్గొనేందుకు నుష్రత్ భరూచా సేఫ్ కొంత కాలం కిందట ఇజ్రాయెల్ కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే పాలస్తీనాకు, ఇజ్రాయిల్ కు మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం, హమాస్ గ్రూప్ వేల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించడంతో అక్కడ పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది. దీంతో ఆమె తన టీమ్ కు దూరమైపోయింది. అయితే నుష్రత్ ఓ ప్రదేశం నుంచి శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు చివరి సారిగా ఫోన్ చేసింది. తాను ఓ బేస్మెంట్లో అందరితో పాటు సురక్షితంగా ఉన్నానని పేర్కొంది. అప్పటి నుంచి నేటి ఉదయం వరకు టీమ్ ఆమెతో ఎలాంటి కమ్యూనికేషన్ చేయలేకపోయింది.
కానీ టీమ్ మెంబర్లు ఆమె కోసం తీవ్ర ప్రయాత్నాలు చేసి చివరికి ఆమె జాడ కనిబెట్టారు. అనంతరం కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకొని నుష్రత్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్నారు. ఆమెను ఇండియాకు తీసుకొచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికైతే ఆమె ఇజ్రాయెల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారత్ కు రానున్నారు.