Asianet News TeluguAsianet News Telugu

ఎలుక మాంసానికి భారీ గిరాకీ.. కేజీ రూ.200

ఎలుక మాంసం కొనడానికి జనాలు తెగ ఉత్సాహం చూపిస్తున్నారట. కేజీ రూ.200 పెట్టి మరీ కొనుగోలు చేసుకుంటున్నారట.

Boiled Or Skinned Rat Is Bestseller At Assam Village For Rs. 200 A Kg
Author
Hyderabad, First Published Dec 26, 2018, 4:12 PM IST

కోడి మాంసం, మేక మాంసం, పంది మాంసం తినడానికి జనాలు విపరీతంగా ఎగబడిన సందర్భాల గురించి అందరూ వినే ఉంటారు. కానీ.. ఎలుక మాంసం కోసం ఎగబడటం ఎప్పుడైనా విన్నారా..? అసలు ఎలుక మాంసం తింటారన్న విషయం తెలుసా..?  ఒక ప్రాంతంలో మాత్రం ఎలుక మాంసం కొనడానికి జనాలు తెగ ఉత్సాహం చూపిస్తున్నారట. కేజీ రూ.200 పెట్టి మరీ కొనుగోలు చేసుకుంటున్నారట. ఇది ఎక్కడో కాదు అస్సాంలో.

సాధారణంగా పంట పొలాల్లోకి ఎలుకలు వెళ్లి పంటలను నాశనం చేస్తూ ఉంటాయి. అలా వచ్చిన ఎలుకలను పంట నాశనం చేయకుండా.. రైతులు తిప్పలు పడి మరీ పట్టుకుంటారు. అలా పట్టుకున్న ఎలుకలను ఏంచేయాలా అని ఆలోచించిన అక్కడి రైతులకు బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. ఇంకేమంది ప్రతి ఆదివారం.. దొరికిన ఎలుకలతో  మార్కెట్ ఏర్పాటు చేశారు.

రైతుల దగ్గర నుంచి ఫ్రెష్ ఎలుకలను కొనుగోలు చేసిన దుకాణదారులు..వాటిని మాంసం కింద అమ్మేస్తుంటారు. వాటి మాంసం కొనడానికి జనాలు తెగ ఎగబడుతున్నారట. దీని వల్ల ఒకవైపు పంట కాపాడుకుంటూనే.. మరో వైపు వీటి తో సంపాదన చేసుకుంటున్నామని సంబరంగా చెబుతున్నారు అక్కడి రైతులు. ముఖ్యంగా ట్రైబల్స్ కి ఈ ఎలుకలు జీవనాధారంగా మారాయని చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios