Asianet News TeluguAsianet News Telugu

మిస్టర్ వరల్డ్ మణికందన్ పై లైంగిక దాడి ఆరోపణలు.. అరెస్ట్...

కొద్ది రోజుల క్రితం చెన్నై కమిషనర్ కార్యాలయంలో 30 యేళ్ల మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా మణికందన్ పై కేసు నమోదు చేశారు. 29 యేళ్ల మణికందన్ చెన్నైలోని ఫిట్ నెస్ సెంటర్ నడుపుతున్నాడు. అతను దేశ, విదేశాల్లో అనేక బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొన్నాడు.

bodybuilder manikandan arrested for assaulting and threatening his ex girlfriend chennai
Author
Hyderabad, First Published Nov 24, 2021, 1:11 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

చెన్నై : మిస్టర్ వరల్డ్, మిస్టర్ తమిళనాడు టైటిళ్లను గెలుచుకున్న చెన్నైకి చెందిన ఆర్ మణికందన్ అనే బాడీ బిల్డర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన మాజీ ప్రియురాలి మీద లైంగిక దాడి చేసి బెదిరించినందుకు పూనమల్లి ఆల్ ఉమెన్ పోలీసులు నవంబర్ 21 ఆదివారం అతడిని అరెస్ట్ చేశారు. 

కొద్ది రోజుల క్రితం చెన్నై కమిషనర్ కార్యాలయంలో 30 యేళ్ల మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా మణికందన్ పై కేసు నమోదు చేశారు. 29 యేళ్ల మణికందన్ చెన్నైలోని ఫిట్ నెస్ సెంటర్ నడుపుతున్నాడు. అతను దేశ, విదేశాల్లో అనేక బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొన్నాడు.

Mr. World title ను మూడుసార్లు, Mr. Tamil Nadu టైటిల్ ను నాలుగు సార్లు గెలుచుకున్నాడు. Manikandan, 30 యేళ్ల మహిళ అక్టోబర్ 2019లో డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నారు. నవంబర్ 20, 2021న మహిళ తన వ్యక్తిగత Instagram accountలో తీవ్రంగా గాయపడిన తన ముఖం ఫొటోలను పోస్ట్ చేసింది. మణికందన్ తన ముఖంపై కొట్టడంతో గాయాలు అయ్యాయని ఆమె ఆరోపించింది. 

‘అతను నన్ను కొట్టిన క్షణంలో నా జీవితం తలకిందులయ్యింది. నేను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురయ్యాను. అతను నన్ను కించపరిచాడు’ అని ఆమె చెప్పారు. వేధింపులను ఎవరికైనా చెబితే చంపేస్తానని మణికందన్ Threaten చేశాడని ఆ మహిళ తన పోస్టులో పేర్కొంది. మణికందన్ ఇతర మహిళలతో relations ఉన్నాయని పేర్కొన్నారు. 

అతడిపై న్యాయ పరంగా పోరాడతానని ఆమె చెప్పారు. ‘నేను మణికందన్ తో లివ్-ఇన్-రిలేషన్ షిప్ లో ఉన్నానని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇది పూర్తిగా తప్పు. ఇప్పటివరకు ఇచ్చిన నా ఇంటర్వ్యూలను పరిశీలించాల్సిందిగా నేనే మీడియాను అభ్యర్థిస్తున్నాను. అని మహిళ పేర్కొంది. పూనమల్లి ఆల్ మహిళా పోలీసులు మణికందన్ ను అరెస్ట్ చేసి అతని  ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని మీద విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఈ అక్టోబర్ లో సింగర్ రాబిన్ పై అమెరికన్ మోడల్ లైంగిక ఆరోపణలు చేశారు. ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. ఓ మ్యూజిక్‌ వీడియో షూటింగ్‌ చేస్తున్నప్పడు సింగర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ప్రముఖ అమెరికన్‌ మోడల్‌ ఎమిలీ రటాజ్‌కోవ్స్‌కీ ఆరోపించింది. 

అప్పట్నుంచి భయంకరమైన పీడకలలు.. లైంగిక ఆరోపణలపై స్పందించిన నటుడు పరల్‌ వీ పూరి

2013లో బ్లర్డ్ లైన్స్ అనే మ్యూజిక్‌ వీడియో షూట్‌ సమయంలో సమయంలో అమెరికన్‌ సింగర్‌ రాబిన్ తికే తాగి సెట్స్‌పైకి వచ్చాడు. 'అంతేకాకుండా నా చాతిని తాకాడు. ఓ వ్యక్తి స్పర్శను నేను వెంటనే తెలుసుకున్నాను. 

ఎవరా అని వెనక్కి తిరిగి చేస్తూ..రాబిన్‌ వెకిలిగా నవ్వుతూ కనిపించాడు. వెంటనే నేను అక్కడి నుంచి పరిగెత్తాను. అప్పుడు మొదటిసారి నేను నగ్నంగా ఉన్నట్లు అనిపించింది' అని ఆమె తెలియజేశారు. ఈ music videoలో ఎమిలీతో పాటు మరో ఇద్దరు మోడల్స్‌ సైతం నగ్నంగా కనిపించారు. షూటింగ్‌ వరకు nudeగా ఉన్నా తానెప్పుడూ అలా ఫీల్‌ అవ్వలేదని, రాబిన్‌ చర్యలతో సిగ్గుతో సెట్‌ వెనకాల దాక్కున్నట్లు emily ఆరోపించింది. 

కాగా ఇటీవలె ఈమె రాసిన  మై బాడీ అనే పుస్తకం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాబిన్‌పై ఎమిలీ చేసిన కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారాయి. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై సింగర్‌ robin ఇంత వరకు స్పందించలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios