JP Nadda's Twitter: బీజేపీ అధ్యక్షుడు JP నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ అయింది. తన ప్రమేయం లేకుండా ఉక్రేనియన్ల కోసం క్రిప్టోకరెన్సీ విరాళాలు కోరుతూ ట్వీట్ పోస్ట్ చేయబడినట్టు తెలిపారు
JP Nadda's Twitter: భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడింది. వారి ప్రమేయం లేకుండా.. ఉక్రేనియన్ల కోసం క్రిప్టోకరెన్సీ విరాళాలు కోరుతూ ఆదివారం ఉదయం ఒక ట్వీట్ పోస్ట్ చేయబడింది.
"ఉక్రెయిన్ పౌరులకు అడ్డంగా నిలబడండి. ఇప్పుడు క్రిప్టోకరెన్సీ విరాళాలను స్వీకరిస్తున్నారు. బిట్‌కాయిన్ , ఎథెరియం" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.దీంతో తన అకౌంట్ హ్యాకింగ్ అయినట్టు ప్రకటించారు.
దీంతో బీజేపీలో కలకలం రేగింది. బీజేపీ అధినేత ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేసినట్టు గుర్తించిన వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ వర్గాలు చర్యలు ప్రారంభించాయి. వెంటనే దానికి సంబంధించిన అన్ని ట్వీట్లను తొలగించారు. ఆ వెంటనే జేపీ నడ్డా ఖాతాను పునరుద్ధరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
హ్యాక్ గురించి సమాచారం అందిందని.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT) దానిని పరిశీలిస్తోందని.. ఐటీ మంత్రిత్వశాఖ అధికారి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.
