దీనికిముందు అంకితకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానిలో ఆమె తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపారు. 

ఓ బీజేపీ ఎంపీ కోడలు.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాగా.. కుటుంబసభ్యులు వెంటనే స్పందించడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

 ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ కౌశల్ కిశోర్ కోడలు అంకిత ఆత్మహత్యాయత్నం చేశారు. తన చేతి నరాలను తెగ్గోసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆమె సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికిముందు అంకితకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానిలో ఆమె తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపారు. 

ఈ సమాచారం అందుకున్న వెంటనే అలీగంజ్ ఎస్పీ అఖిలేష్ సింగ్ మూడు బృందాలను ఏర్పాటు చేసి, ఆమె కోసం గాలించారు. అర్థరాత్రి దాటాక ఆమె ఆచూకీ తెలుసుకుని, మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంకితకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక వీడియో ఐదు నిముషాలు ఉండగా, మరో వీడియో మూడు నిముషాలు ఉంది. 

ఆ వీడియోలో ఆమె తన పుట్టింట్లో ఉంటూ భర్త కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొంది. ఇక అతను రాడని భావించి ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నానని తెలిపింది. తన ఆత్మహత్యకు భర్త, అత్తామలే కారణమని అంకిత పేర్కొంది. ఈ వీడియోను చూసిన ఎస్పీ ఆమెను మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.